news18-telugu
Updated: November 8, 2020, 9:35 PM IST
ప్రతీకాత్మక చిత్రం
దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది ధనలక్ష్మి...డబ్బుకు అధిదేవత అయిన లక్ష్మీ దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉత్సవమే దీపావళి. అయితే ఈ దీపావళి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు కూడా పండగే అని చెప్పాలి. దీపావళి సందర్భంగా ప్రత్యేకమై ముహరత్ ట్రేడింగ్ జరపడం ఆనవాయితీ, అంతేకాదు దీపావళి రోజున ప్రత్యేకంగా షేర్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ శుభదినాన పెట్టుబడి పెట్టడానికి మంచి సమయంగా ట్రేడర్లు భావిస్తుంటారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలకు దగ్గరగా ఉంది. కొన్ని స్టాక్స్ గతంలో మంచి రాబడిని ఇవ్వడమే కాక, భవిష్యత్తులో కూడా చాలా బలమైన రాబడిని కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీపావళి సందర్భంగా, బ్రోకింగ్ సంస్థలు ఉత్తమ స్టాక్లను రికమండ్ చేస్తుంటాయి.అయితే స్టాక్ మార్కెట్లో చాలా రిస్క్ ఉంటుంది, కానీ బ్రోకింగ్ సంస్థలు చాలా రీసెర్చ్ లు చేసిన తరువాత ఈ స్టాక్ లను కొనాలని సిఫార్సు చేస్తున్నారు. ఇలాంటి 4 మిడ్, స్మాల్ క్యాప్ షేర్లను IIFL సంస్థ రికమండల్ చేసింది. ఈ 4 షేర్లను దీపావళి సందర్భంగా కొనుగోలు చేయవచ్చు. ఈ స్టాక్స్ గురించి తెలుసుకుందాం.
Persistent systemsపెర్సిస్టెంట్ సిస్టమ్స్ అనేది మిడ్ సైజ్ ఐటి సేవల సంస్థ, ఇది గత కొన్ని త్రైమాసికాలలో పెద్ద మొత్తంలో స్వీకరించిన పెద్ద ఆర్డర్ల ద్వారా మంచి ఆదాయం మూటగట్టనుంది, ప్రస్తుతం క్లయింట్ మైనింగ్‌పై దృష్టి సారించింది. ఐఐఎఫ్ఎల్ ప్రకారం, స్టాక్ ప్రస్తుత ధర నుండి 32 శాతం పెరగవచ్చు. ప్రస్తుతం ఈ స్టాక్ రూ .1143.55 వద్ద ఉంది. ఈ కంపెనీ మార్కెట్ కాపిటల్ రూ .8499 కోట్లు. ఆర్థికంగా, రాబోయే సంవత్సరాల్లో కంపెనీ అధిగమిస్తుందని భావిస్తున్నారు.
Security and Intelligence Services
సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ భారతదేశంలో ప్రముఖ ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థ. ఐఐఎఫ్ఎల్ అంచనా ప్రకారం ప్రస్తుత స్థాయి నుండి 46 శాతం వరకు వెళ్ళవచ్చు. ప్రస్తుతం, సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ షేర్లు 375 రూపాయలుగా ఉన్నాయి. దీని మార్కెట్ క్యాపిటల్ రూ .5505 కోట్లు. భారతదేశం కాకుండా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ బలమైన స్థానాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతాల్లో వృద్ధి గణనీయంగా ఉంటుంది,
Apollo Tyres
అపోలో టైర్స్ స్టాక్ 22% పెరుగుతుందని ఐఐఎఫ్ఎల్ ఆశిస్తోంది. అపోలో టైర్స్ ట్రక్ మరియు బస్ విభాగంలో 25 శాతం మార్కెట్ వాటాను, పర్సనల్ వాహన విభాగంలో 15 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఈ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన టైర్ తయారీదారుగా ఉంది. ఇక అపోలో టైర్స్ ఇటీవల నెదర్లాండ్స్‌లో లేఆఫ్స్ ప్రకటించింది, ఇది కంపెనీకి 50 మిలియన్ యూరోలు ఆదా చేస్తుంది.
Tube investments
Tube investments స్టాక్ కొనాలని బ్రోకింగ్ సంస్థ ఐఐఎఫ్ఎల్ సూచించింది. బ్రోకింగ్ సంస్థ ప్రకారం, ఈ స్టాక్ 13 శాతం పెరుగుతుందని అంచనా. ఇది మురుగప్ప గ్రూపులో భాగం. భారతదేశం మరియు విదేశాలలో ఆటో మరియు పారిశ్రామిక రంగాలలో దీనికి బలమైన స్థానం ఉంది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ సిజి పవర్‌ను సొంతం చేసుకోబోతున్నాయి. ఇది సంస్థ యొక్క పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరుస్తుంది.
గమనిక..
పైన పేర్కొన్న రికమండేషన్స్ IIFLసంస్థ నిపుణులు రికమండ్ చేసినవి. అలాగే ఈ షేర్లు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే సూచిస్తున్నాం. పెట్టుబడి పెట్టేముందు నిపుణుల సలహా తప్పనిసరి.
Published by:
Krishna Adithya
First published:
November 8, 2020, 9:35 PM IST