హోమ్ /వార్తలు /బిజినెస్ /

Saffron Cultivation: మట్టి లేకుండా..కుంకుమ పువ్వును పండిస్తున్న యువ రైతు.. భారీగా లాభాలు

Saffron Cultivation: మట్టి లేకుండా..కుంకుమ పువ్వును పండిస్తున్న యువ రైతు.. భారీగా లాభాలు

ఏరోపోనిక్ విధానంలో కుంకుమపువ్వు సాగు (Image:ANI)

ఏరోపోనిక్ విధానంలో కుంకుమపువ్వు సాగు (Image:ANI)

Saffron Cultivation: మహారాష్ట్రలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. సరికొత్త విధానంలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్నాడు. షిప్పింగ్ కంటైనర్లలో 160 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఏరోపోనిక్ టెక్నాలజీతో పంట పడిస్తున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కుంకుమ పువ్వు (Saffron).. చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దీనిని అనేక రకాల వంటకాలతో పాటు ఆయుదర్వేద ఔషధాల్లోనూ వినియోగిస్తారు. కుంకుమ పువ్వు ఎక్కడ పడితే అక్కడ పండదు. ప్రత్యేకమైన నేత, వాతావరణ పరిస్థితుల్లోనే.. కుంకుమ పువ్వు పండుతుది. కానీ ఇది ఒక్కప్పటి మాట.. ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. వ్యవసాయం (Agriculture) కొత్త పుంతలు తొక్కుతోంది. మట్టితో పనిలేకుండానే... పంటలు పండిచ్చే రోజులు వచ్చేశాయి. సాధారణ పంటలే కాదు.. ఎంతో క్లిష్టమైన, సున్నితమైన కుంకుమ పువ్వు సాగు కూడా ఇంట్లోనే... మట్టితో పనిలేకుండా చేయవచ్చు. అవును ఇది నిజం.

Centre: రైతులకు గుడ్ న్యూస్.. ఎరువుల ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..

మహారాష్ట్రలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. సరికొత్త విధానంలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్నాడు. పుణెకు చెందిన శైలేష్ మోదక్ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంచి జీతం..విలాసవంతమైన జీవితం. ఐనప్పటికీ శైలేష్‌కి వ్యవసాయంపై ఆసక్తి. ఐతే సంప్రదాయ పద్దతులు కాకుండా.. అధునాతన పద్దతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ఏరోపోనిక్ విధానంలో ఇప్పటికే స్ట్రాబెర్రీ, కూరగాయలు పండిస్తున్న ఆయన.. ఇప్పుడు కుంకుమ పువ్వును కూడా పండిస్తున్నాడు.

'' మేం షిప్పింగ్ కంటైనర్‌లలో కుంకుమ పువ్వును సాగుచేస్తున్నాం. మట్టి అవసరం లేకుండా హైడ్రోపోనిక్ విధానాన్ని అనుసరిస్తున్నాం. ఈ విధానంలో మొదట కూరగాయలు, స్ట్రాబెరీలను సాగు చేశాం. ఇప్పుడు కుంకుమ పువ్వును కూడా పండిస్తున్నాం. కుంకుమ పువ్వు సాగు కోసం నేను రూ.10 లక్షల పెట్టుబడి పెట్టాను. ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ . కాశ్మీర్ నుంచి విత్తనాలను తీసుకొచ్చా. 160 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఏరోపోనిక్ టెక్నాలజీతో కుంకుమ పువ్వును సాగుచేస్తున్నా.'' అని శైలేష్ మోదక్ తెలిపారు.

ఏరోపోనిక్ విధానంలో చిన్న చిన్న నీటి తుంపర్ల సాయంతో వ్యవసాయం చేస్తారు. ఈ తుంపర్లతో పొగమంచు ఏర్పడుతుంది. దీని నుంచే మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తారు. ఏరోపోనిక్ పద్దతిలో వ్యవసాయం చేస్తే.. తక్కువ ప్రదేశంతో.. తక్కువ సమయంలో.. ఎక్కువ దిగుబడిని పొందుతారు. చాలా దేశాల్లో ఈ టెక్నాలజీ ఉంది. మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే కొందరు యువ రైతులు ఏరోపోనిక్ విధానంలో పంటలు పండిస్తూ.. అధిక లాభాలను గడిస్తున్నారు.

First published:

Tags: Agriculture, Business Ideas, Farmers, Saffron

ఉత్తమ కథలు