Home /News /business /

UPI Auto pay: రికరింగ్‌ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా? ‘యూపీఐ ఆటోపే’ని ఇలా సెటప్ చేయండి..

UPI Auto pay: రికరింగ్‌ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా? ‘యూపీఐ ఆటోపే’ని ఇలా సెటప్ చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్త ఆటో-డెబిట్ రూల్ అక్టోబర్ 1 నుంచి అమలవుతున్న నేపథ్యంలో.. యూపీఐ యాప్‌లో ఈ-మాన్డేట్ సెటప్ చేసి ఆటోపే ఆప్షన్‌ ద్వారా ఎలా బెనిఫిట్స్ పొందాలో చూద్దాం.

బ్యాంకింగ్ మోసాల(Banking fraud) నుంచి కస్టమర్లకు రక్షణ అందించేందుకు ఆర్‌బీఐ కీలక చర్యలు చేపడుతోంది. ఈ ప్రయత్నంలో డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐల ద్వారా చేసే రికరింగ్‌ చెల్లింపులపై ఆర్‌బీఐ (Reserve Bank of India) నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు అవుతున్న ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం రికరింగ్‌ పేమెంట్స్ పై(Recurring payments) అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) చేయాల్సి ఉంటుంది. ఏఎఫ్‌ఏ ప్రాసెస్‌ను రిజిస్ట్రేషన్ సమయంలో ఓటీపీ సబ్మిట్ చేసి అప్రూవ్ చేసినంత ఈజీగా పూర్తి చేయొచ్చు. ఆర్‌బీఐ అడిషినల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌ (ఏఎఫ్‌ఏ)ను తప్పనిసరి చేయగా.. కస్టమర్లు రూ.5 వేల కంటే తక్కువ లావాదేవీలు చేసేటప్పుడు కూడా అప్రూవల్ ఇవ్వాల్సి వస్తోంది. అయితే యూపీఐ ఆటోపే (UPI AUTOPAY)తో కస్టమర్లు రికరింగ్‌ ఈ-మాన్డేట్ (e-mandate) ఎనేబుల్ చేసి రూ.5 వేల లోపు ఆటోమేటిక్ రికరింగ్‌ పేమెంట్స్ చేసుకోవచ్చు.

మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లు, బీమా, మ్యూచువల్ ఫండ్స్ వంటి రికరింగ్‌ చెల్లింపుల కోసం ఏ యూపీఐ అప్లికేషన్‌లోనైనా కస్టమర్లు ఈ-మాన్డేట్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు రికరింగ్‌ చెల్లింపుల ప్రతినెలా ఆటోమేటిక్‌గా జరిగిపోవాలని అనుకుంటే.. మీ యూపీఐ అప్లికేషన్‌లో.. రికరింగ్‌ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ-మాన్డేట్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ లావాదేవి రూ.5,000 దాటితే.. అప్పుడు మీరు యూపీఐ పిన్‌తో ప్రతి మాన్డేట్ ను కంప్లీట్ చేయాల్సి ఉంటుందని గుర్తించాలి.

Apple iPad Pro: అమెజాన్ ఫెస్టివల్​ సేల్​లో యాపిల్‌​ ఐప్యాడ్​ ప్రో ట్యాబ్లెట్​పై బంపరాఫర్​.. ​ ఏకంగా రూ.15 వేల తగ్గింపు

కొత్త ఆటో-డెబిట్ రూల్ అక్టోబర్ 1 నుంచి అమలవుతున్న నేపథ్యంలో.. యూపీఐ యాప్‌లో ఈ-మాన్డేట్ సెటప్ చేసి ఆటోపే ఆప్షన్‌ ద్వారా ఎలా బెనిఫిట్స్ పొందాలో చూద్దాం.

• మొదటగా భీమ్‌ యూపీఐ (BHIM UPI) యాప్‌లో లాగిన్ అవ్వండి. 'ఆటో డెబిట్ (Auto Debit)' ఆప్షన్ పై క్లిక్ చేసి ఆపై 'మాన్డేట్ (Mandate)' సెలెక్ట్ చేయండి.

• అన్ని యూపీఐ- ఎనేబుల్డ్ అప్లికేషన్‌లో 'మాన్డేట్' అనే సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ లో కస్టమర్లు ఆటో-డెబిట్ మాన్డేట్ ను క్రియేట్ చేయవచ్చు.. మోడిఫై చేయవచ్చు. అలాగే పాజ్, క్యాన్సిల్ కూడా చేయొచ్చు.

Amit Shah Warning: మ‌రిన్ని surgical strikes త‌ప్ప‌వు.. పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా..

• నెక్స్ట్ స్టెప్ లో "మేనేజ్ మాన్డేట్" సెక్షన్ ఎంచుకోవాలి. ఈ సెక్షన్ లో కస్టమర్లు తమ గత మాన్డేట్స్ వీక్షించవచ్చు. యూపీఐ యూజర్లు యూపీఐ ఐడీ (UPI ID), క్యూఆర్ స్కాన్, ఇంటెంట్ (Intent) ద్వారా ఈ-మాన్డేట్ క్రియేట్ చేయవచ్చు.

• తరువాత యూజర్లు "పేమెంట్ ఫ్రీక్వెన్సీ లేదా పీరియడ్" ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం రికరింగ్‌ చెల్లింపులపై కస్టమర్ల కర్చులను దృష్టిలో ఉంచుకుని ఆటో-డెబిట్ మాన్డేట్ కోసం ఒక ప్యాట్రన్ రూపొందించారు. దీని ప్రకారం.. మాన్డేట్ ఒక సారి, డైలీ, వార(weekly), పక్షం (fortnightly) నెలవారీ, ద్వైమాసిక(bimonthly), త్రైమాసిక(quarterly), హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ సెట్ చేయవచ్చు.

• తర్వాత మర్చంట్ నేమ్ యాడ్ చేసి ఆటో డెబిట్ తేదీని ఎంచుకోవాలి. చివరకు 'ప్రొసీడ్' పై క్లిక్ చేయాలి.

• ఖాతాను యూపీఐ పిన్ ద్వారా ఒకసారి ధ్రువీకరిస్తే చాలు.. తదుపరి నెలవారీ చెల్లింపులు ఆటోమేటిక్ గా డెబిట్ అవుతాయి.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Reserve Bank of India, UPI

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు