Home /News /business /

SEPTEMBER DEADLINE IS NEAR DO THESE 3 TASKS IMMEDIATELY KMV

September 30 Deadline: ఈ మూడింటికి సెప్టెంబర్ 30 వరకే గడువు.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే..

సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాల్సిన 3 పనులివే.. లేదంటే..

సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాల్సిన 3 పనులివే.. లేదంటే..

Credit Card |సెప్టెంబర్ నెల చివరకు వచ్చేస్తున్నాం. ఈ నెల చివరి కల్లా కచ్చితంగా కొన్ని పనులు పూర్తి చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేటివేటికి సెప్టెంబర్ 30 డెడ్‌లైన్‌గా ఉందో ఒకసారి తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
    Pension | ఇంకో వారం రోజులు గడిస్తే కొత్త నెలలోకి అడుగు పెట్టేస్తాం. అయితే సెప్టెంబర్ నెల చివరి కల్లా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏ ఏ పనులను ఈ నెల చివరి కల్లా కచ్చితంగా పూర్తి చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కార్డు టోకెనైజేషన్ (Credit Card) నుంచి అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojana) స్కీమ్ వరకు పలు పనులు పూర్తి చేసుకోవాలి. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఎలిజిబిలిటీని కేంద్ర ప్రభుత్వం సవరించింది. పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ నుంచి ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరడం వీలు కాదు. ఎవరైనా ట్యాక్స్ పేయర్లు ఇందులో చేరి ఉంటే ఉపసంహరించుకోవడం ఉత్తమం. కాగా 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఈ పథకంలో చేరడం వల్ల నెలకు రూ. 1000 నుంచి రూ. 5 వేల వరకు పెన్షన్ పొందొచ్చు. 2015 నుంచి ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. ప్రతి నెలా మీరు చెల్లించే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే పెన్షన్ అధారపడి ఉంటుంది. ఆధార్ కార్డుదారులకు కొత్త సేవలు.. ఇక మరింత భద్రంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు! అలాగే డీమ్యాట్ అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా 2 ఫ్యాక్టర్ అథంటికేషన్‌ను సెట్ చేసుకోవాలి. ఈ నెల చివరి కల్లా ఈ పని పూర్తి చేసుకోవాలి. ఒకవేళ ఈ పని చేయకపోతే అక్టోబర్ 1 నుంచి ట్రేడింగ్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వలేకపోవచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకారం.. డీమ్యాట్ అకౌంట్‌కు బయోమెట్రిక్ అథంటికేషన్ ఉండాలి. అలాగే నాలెడ్జ్ ప్యాక్టర్ అంటే పాస్‌వర్డ్, పిన్ వంటి సెకండ్ ఆప్షన్ కూడా సెట్ చేసుకోవాలి. బంగారం ధర రూ.6,500 పతనం.. వెండి రూ.19 వేలు ఢమాల్! ఆల్‌టైమ్ గరిష్టం నుంచి.. కార్డ్ టోకెనైజేషన్‌ను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేసుకోవాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వారు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కార్డు కలిగిన వారు కార్డు నెంబర్‌ను ఒక ప్రత్యేకమైన నెంబర్‌తో రిప్లేస్ చేసుకోవాలి. కార్డు టోకెనైజేషన్ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. వచ్చే నెల నుంచి ఏ వెబ్‌సైట్‌లో లేదా యాప్‌లో మీ కార్డు వివరాలు సేవ్ కావు. అందువల్ల మీరు కార్డు టోకెనైజేషన్‌ను ఈ నెల చివరి కల్లా పూర్తి చేసుకోండి. తర్వాత ఇబ్బంది లేకుండా ట్రాన్సాక్షన్లు నిర్వహించుకోవచ్చు. ఫోన్ పే, అమెజాన్ పే వంటి వాటిల్లో అవే కార్డు టోకెనైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తాయి. అందువల్ల ఇబ్బంది పడాల్సిన పని లేదు. సులభంగానే పూర్తి చేసుకోవచ్చు.
    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Atal Pension Yojana, Credit card, Money, Pensions

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు