స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు... జోక్స్ పేల్చిన నెటిజన్లు...

Sexsex : ఇటీవల ఎప్పుడూ లేనిది సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు ఎగబాకడంతో... సోషల్ మీడియాలో కామెంట్ల తుఫాను పుట్టింది. నెటిజన్లు రకరకాల జోక్స్ వేసి... తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 21, 2019, 11:26 AM IST
స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు... జోక్స్ పేల్చిన నెటిజన్లు...
స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు... జోక్స్ పేల్చిన నెటిజన్లు... (Credit - Twitter - Chozhalanattan)
  • Share this:
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఉద్దీపనలు ప్రకటించి... పన్నును తగ్గించడంతో... శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు సాధించిన విషయం మనకు తెలుసు. సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లకు ఎగబాకడంతో... ఇంకేముంది... చిన్న, మధ్య తరగతి వాటా దారుల జీవితాలు అద్భుతంగా మారిపోయినట్లేననీ, ఒక్క రోజులో వాళ్లంతా సంపన్నులుగా మారిపోయారనే వాదనలు వినిపించాయి. ఐతే... నెటిజన్లు ఆ వాదనలను ఖండిస్తూ... సెటైరికల్ జోక్స్ వేశారు. అవును నిజమే... మా జీవితాలు అద్భుతంగా అయిపోయాయి... ఒక్క రోజులో మేం అపర కుభేరులం అయిపోయాం అంటూ సెటైర్లు పేల్చారు. ఫలితంగా సెన్సెక్స్, కార్పొరేట్ టాక్స్ అనే పదాలు... ట్రెండింగ్ అయ్యాయి. క్రియేటివ్ పోస్టులు పుట్టుకొచ్చాయి.


నిజానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను తగ్గింపు ప్రకటనను కొందరు ఆర్థిక వేత్తలు స్వాగతిస్తే... కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లాంటి వారు వ్యతిరేకించారు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని ఆనందపరచడానికేననీ, కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా ప్రధాని మోదీ నిర్ణయాలు ఉంటున్నాయని రాహుల్ విమర్శించారు.
కార్పొరేట్ కంపెనీలకు పన్ను తగ్గించడం వల్ల సామాన్యులకు ఏం ప్రయోజనం ఉంటుందని మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం మాత్రం... తమ నిర్ణయం ఎక్కువ మందికి నచ్చడం వల్లే... సెన్సెక్స్ లాభాల్లో ముగిసిందని తెలిపింది.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు