హోమ్ /వార్తలు /బిజినెస్ /

Stock market: 60 సెకన్లలో రూ.4 లక్షల కోట్లు ఆవిరి...రక్తమోడుతున్న స్టాక్ మార్కెట్..

Stock market: 60 సెకన్లలో రూ.4 లక్షల కోట్లు ఆవిరి...రక్తమోడుతున్న స్టాక్ మార్కెట్..

Stock Market: ఇన్వెస్టర్లకు భారీ షాక్...
(ప్రతీకాత్మక చిత్రం)

Stock Market: ఇన్వెస్టర్లకు భారీ షాక్... (ప్రతీకాత్మక చిత్రం)

కేవలం 60 సెకన్ల సమయంలో దాదాపు రూ.4.42 కోట్లు ఆవిరైపోయాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మూలధనం రూ.147.59 లక్షల కోట్ల నుంచి రూ.147.59 లక్షల కోట్లకు పతనమైంది.

Stock market: కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు విలవిల లాడుతున్నాయి. సెన్సెక్స్ శుక్రవారం ప్రారంభమైన వెంటనే 1459 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ సైతం 374 పాయింట్లు నష్టపోయింది. కేవలం 60 సెకన్ల సమయంలో దాదాపు రూ.4.42 కోట్లు ఆవిరైపోయాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మూలధనం రూ.147.59 లక్షల కోట్ల నుంచి రూ.147.59 లక్షల కోట్లకు పతనమైంది. దేశంలోని నాలుగో అతిపెద్ద లెండర్ ఎస్ బ్యాంక్ విత్ డ్రాయల్స్ పై మారిటోరియం విధించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. సెక్టార్ పరంగా చూసినట్లయితే బ్యాంకింగ్ స్టాక్స్ భారీగా నష్టపోతున్నాయి. ఎస్ బ్యాంక్ ఏకంగా 30 శాతం నష్టపోయింది. అలాగే ఎన్ఎస్ఈ సూచీలోని 395 స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయిని తాకాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ సూచీ -4.09 శాతం నష్టపోయింది. యాక్సిస్ బ్యాంక్ -3.85 శాతం, ఎస్బీఐ -6.64 శాతం నష్టపోయింది. ఆర్బీఎల్ బ్యాంక్ 16 శాతం నష్టపోయింది. ఐసీఐసీఐ బ్యాంక్ 4 శాతం నష్టపోయింది.

First published:

Tags: Stock Market

ఉత్తమ కథలు