SENSEX RISES FURTHER ON LAST SESSION OF THE YEAR AND CLOSES BY 460 POINTS GAIN MK
Stock Market: సంవత్సరం చివరి రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..టాప్ గెయినర్లుగా బ్యాంకింగ్, సిమెంట్ స్టాక్స్..
(ప్రతీకాత్మక చిత్రం)
Stock Market: సంవత్సరం చివరి రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎట్టకేలకు గరిష్ట స్థాయి నుంచి వరుసగా పతనం అవుతున్న స్టాక్ మార్కెట్లో రికవరీ బాటపట్టాయి. ఈరోజు సెన్సెక్స్ దాదాపు 459.50 పాయింట్లు పెరిగి 58253.82 పాయింట్ల వద్ద ముగిసింది.
Stock Market: సంవత్సరం చివరి రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎట్టకేలకు గరిష్ట స్థాయి నుంచి వరుసగా పతనం అవుతున్న స్టాక్ మార్కెట్లో రికవరీ బాటపట్టాయి. ఈరోజు సెన్సెక్స్ దాదాపు 459.50 పాయింట్లు పెరిగి 58253.82 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 17354 పాయింట్ల స్థాయిలో ముగిసింది. ఇది కాకుండా, ఈరోజు BSEలో మొత్తం 3,480 కంపెనీలలో ట్రేడింగ్ జరిగింది, వీటిలో దాదాపు 2,439 షేర్లు లాభాల్లో ముగియగా, 947 షేర్లు రెడ్ గా ముగిశాయి. అదే సమయంలో 94 కంపెనీల షేరు ధరలో ఎలాంటి తేడా కనిపించలేదు. ఈ రోజు 430 స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. ఇది కాకుండా, 16 స్టాక్‌లు 52 వారాల కనిష్ట స్థాయి వద్ద ముగిశాయి. అలాగే 719 షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి, 107 షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈ సాయంత్రం డాలర్‌తో రూపాయి 8 పైసలు బలపడి రూ.74.33 వద్ద ముగిసింది.
నిఫ్టీ టాప్ గెయినర్లు
హిందాల్కో షేరు రూ.26 పెరిగి రూ.475.55 వద్ద ముగిసింది.
టైటాన్ కంపెనీ షేరు రూ.85 పెరిగి రూ.2,522.40 వద్ద ముగిసింది.
అల్ట్రాటెక్ సిమెంట్ షేరు రూ.194 పెరిగి రూ.7,591.05 వద్ద ముగిసింది.
టాటా మోటార్స్ షేరు ఒక్కో షేరుపై రూ.3 పెరిగి రూ.482.40 వద్ద ముగిసింది.
కోటక్ మహీంద్రా స్టాక్ రూ.41 పెరిగి రూ.1,796.10 వద్ద ముగిసింది.
నిఫ్టీ టాప్ లూజర్స్
ఎన్టీపీసీ షేరు దాదాపు రూ.3 తగ్గి రూ.124.40 వద్ద ముగిసింది.
సిప్లా షేర్లు రూ.9 క్షీణించి రూ.944.10 వద్ద ముగిశాయి.
టెక్ మహీంద్రా షేరు దాదాపు రూ.9 తగ్గి రూ.1,790.55 వద్ద ముగిసింది.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు దాదాపు రూ.1 తగ్గి రూ.204.40 వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్ షేరు దాదాపు రూ.5 తగ్గి రూ.1,887.75 వద్ద ముగిసింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.