Union Budget 2021-22: బడ్జెట్ కు ముందు సెన్సెక్స్ దూకుడు...ఓపెనింగ్ లో 400 పాయింట్ల లాభం..

ప్రతీకాత్మకచిత్రం

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2021 పై అటు స్టాక్ మార్కెట్లో మదుపరులు నిఘా ఉంచడంతో భారత బెంచ్ సూచీలు సోమవారం దాదాపు ఒక శాతం లాభంతో ముందుకు దూకాయి.

  • Share this:
    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2021 పై అటు స్టాక్ మార్కెట్లో మదుపరులు నిఘా ఉంచడంతో భారత బెంచ్ సూచీలు సోమవారం దాదాపు ఒక శాతం లాభంతో ముందుకు దూకాయి. కేంద్ర బడ్జెట్ 2021 గత సంవత్సరం ఉద్దీపన ప్యాకేజీలపై వరుస ప్రకటనల తరువాత ఆర్థిక వ్యవస్థకు మరింత పరిపుష్టినిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో. ఉదయం 9:18 గంటలకు సెన్సెక్స్ 458 పాయింట్లు పెరిగి 46,744 వద్ద ఉండగా నిఫ్టీ 115 పాయింట్లు పెరిగి 13,749 వద్దకు చేరుకుంది. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి.



    నిఫ్టీ 50 సూచికలో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్, హీరో మోటో, మరియు ఐఒసి అత్యధిక లాభాలు సాధించగా, సిప్లా, యుపిఎల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా మరియు యాక్సిస్ బ్యాంక్ నష్టాలకు దారితీశాయి. సెక్టార్ పరంగా చూస్తే నిఫ్టీ బ్యాంక్ మరియు ఫిన్ సర్వీసెస్ ఇండసీలు అత్యధికంగా 1.4 శాతం పెరిగాయి, నిఫ్టీ ఆటో మరియు నిఫ్టీ ఎఫ్ఎంసిజి వరుసగా 0.8 శాతం మరియు 0.5 శాతం జోడించాయి. అయితే, ఐటి ఇండెక్స్ మరియు ఫార్మా ఇండెక్స్ కొంత లాభాలను ఆర్జించాయి. నిఫ్టీ ఐఆర్ సూచీ 0.2 శాతం, నిఫ్టీ ఫార్మా 1.6 శాతం పడిపోయింది.
    Published by:Krishna Adithya
    First published: