స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ పతనమయ్యాయి. ఉదయం నుంచే డౌన్‌ట్రెండ్ కనిపించింది. సెన్సెక్స్ 550 పాయింట్లు నష్టపోయి 36 వేల మార్క్ కన్నా దిగువకు పతనమైంది. నిఫ్టీ కూడా అంతే. 150 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 550 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 35,975 దగ్గర, 150 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 10,858 దగ్గర ఆగాయి.
క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, ఇటలీ సంక్షోభం, రూపాయి విలువ మరింత పతనమవడం లాంటి అంశాలు మార్కెట్లు కుప్పకూలడానికి కారణాలు. శ్రీరాం ట్రాన్స్పోర్ట్, క్యాన్‌ఫిన్ హోమ్స్, రిలయెన్స్ నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్, ముత్తూట్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, జ్యుబిలియం ఫుడ్ లాంటి షేర్లు నష్టపోయాయి. బల్రాంపూర్ చీనీ, ధాంపూర్ షుగర్, నాల్కో, గతీ లాంటి షేర్లు లాభపడ్డాయి.