Stock Market: ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్...సెన్సెక్స్ 1400 పాయింట్ల లాభం

Stock Market | ఏడో దశ పోలింగ్ ముగిశాక వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేకి స్పష్టమైన మెజార్టీని కట్టబెట్టాయి. హంగ్ ప్రభుత్వానికి అవకాశం లేదని, మళ్లీ స్థిరమైన మోడీ సర్కారు అధికార పగ్గాలు చేపట్టనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి.

news18-telugu
Updated: May 20, 2019, 3:07 PM IST
Stock Market: ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్...సెన్సెక్స్ 1400 పాయింట్ల లాభం
స్టాక్ మార్కెట్
  • Share this:
ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ కనిపించడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు...పైపైకి దూసుకుపోతున్నాయి. కొద్దిసేపటి క్రితం బీఎస్ఈ సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతుండగా...నిఫ్టీ 400 పాయింట్ల మేర లాభపడింది. ఆదివారం సాయంత్రం లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏదే పైచేయి కనిపించింది.  2014 ఫలితాలతో పోలిస్తే సీట్లు కాస్త తగ్గినా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజార్టీ ఎన్డీఏకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యూపీఏ మ్యాజిక్ మార్క్‌కు దరిదాపులో కూడా లేకపోవడంతో ఇక ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా వెలువడతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హంగ్ ప్రభుత్వానికి ఛాన్స్ లేదని, మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల పట్ల మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దీంతో కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు సోమవారం ఒక్కసారిగా కోలుకున్నాయి. భారీ స్థాయిలో నష్టాలను భర్తీ చేసుకున్నాయి.

వాస్తవానికి ఆరో దశ పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోవడం, మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవన్న వాదనలు వినిపించడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టపోయాయి. కానీ ఏడో దశ పోలింగ్ ముగిశాక వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. మధ్యాహ్నం 3 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 1379 పాయింట్ల లాభంతో 39310 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుండగా...నిఫ్టీ 408 పాయింట్ల లాభంతో 11,815 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.

Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే


ఇవి కూడా చదవండి:

IRCTC: రైలులో వెళ్తున్నారా? ఈ 11 ఐడీ ప్రూఫ్స్ చూపించొచ్చు

PMSBY: ఏటా రూ.12 ప్రీమియంతో రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్

ATM: ఏటీఎంలో ఏఏ సేవలు లభిస్తాయో తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: May 20, 2019, 3:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading