జియో టారిఫ్‌లపై ప్రకటన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లాయి. దాదాపు 4శాతం ఎగబాకి జీవితకాల గరిష్టానికి చేరుకుని రూ.1571.85 వద్ద ట్రేడ్ అవుతోంది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఈక్విటీ బెంచ్ మార్క్ బుధవారం 300 పాయింట్లకు చేరుకుని జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ లాభాలతో దూసుకుపోవడంతో ఉదయం సెషన్లో రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్ గరిష్ట స్థాయిని తాకాయి.సెన్సెక్స్ 40,816.38 గరిష్ట స్థాయిని తాకి, 30-షేర్ల సూచీ 321.20 పాయింట్లు లాభపడి 40,790.90 వద్ద ట్రేడవుతోంది.అలాగే నిఫ్టీ 12,000 మార్కును తాకి 87.25 పాయింట్లు లాభపడి 12,027.35 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకపు విలువ 71.69గా ట్రేడ్ అవుతోంది.
జియో టారిఫ్‌లపై ప్రకటన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లాయి. దాదాపు 4శాతం ఎగబాకి జీవితకాల గరిష్టానికి చేరుకుని రూ.1571.85 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో కంపెనీ విలువ రూ.10లక్షల కోట్ల మార్కెట్‌కి చేరుకుంది. అటు వొడాఫోన్ 22శాతం పైకి ఎగబాకగా.. భారతి ఎయిర్టెల్ కూడా 2శాతం పైకి ఎగబాకింది.ఇదిలా ఉంటే బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, ఎన్టిపిసి, హెచ్‌సిఎల్ టెక్, ఎస్బిఐ, హీరో మోటోకార్ప్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.