దలాల్ స్ట్రీట్ లో మార్కెట్ పతనం ప్రకంపనలు సృష్టిస్తోంది. గురువారం మార్కెట్లు ఆరంభంలోనే మదుపరులకు భారీ నష్టాలను మూటగట్టాయి. సెన్సెక్స్ ప్రీ ఓపెనింగ్ లోనే 1000 పాయింట్లు పతనమైంది. అయితే ఈ పతనం ఇక్కడితో ఆగలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 32990 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమవడంతో పాటు 2500 పాయింట్లు సెనెక్స్ పతనమైంది. మార్కెట్లో ఈ స్థాయిలో పతనం రెండేళ్లలో ఇదే కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అటు నిఫ్టీ సైతం 2018 మార్చ్ తర్వాత 10 వేల పాయింట్ల దిగువకు పతనమైంది. మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి సెన్సెక్స్ 34000 వేల పాయింట్ల దిగువకు పతనమై 17 నెలల దిగువకు పతనమైంది. అటు ఇండెక్స్ లో హెవీ వెయిట్ స్టాక్స్ అయిన HDFC, HDFC Bank, Reliance Industries, TCS, Infy స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ కూడా 25 వేల పాయింట్ల దిగువకు పతనమైంది. నిఫ్టీ సూచీలోని అన్ని షేర్లు పతనం బాటపట్టాయి. టాటా మోటార్స్ టాప్ లూజర్ గా నిలిచాయి. టాటా మోటార్స్ 11 సంవత్సరాల దిగువకు పతనమైంది.
వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ కరోనాను మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లన్నీ భారీగా పతనం బాటపట్టాయి. అటు అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. డోజోన్స్ సూచీ 1464 పాయింట్లు పతనమవగా, ఎస్ అండ్ పీ 140 పాయింట్లు నష్టపోయింది. అటు ఆసియా మార్కెట్లు సైతం భారీగా పతనం బాట పట్టాయి. షాంఘై సూచీ 1.54 శాతం, నిక్కీ 4.41 శాతం పతనమయ్యాయి. మరోవైపు అమెరికా నుంచి యూరప్ కు చెందిన 26 దేశాలకు నెల రోజుల పాటు ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో అల్లకల్లోలం చెలరేగింది.
#MarketSlump | #Sensex down nearly 2,500 points, trading at 17-month low pic.twitter.com/HO61LdnfQI
— CNBC-TV18 (@CNBCTV18Live) March 12, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, BUSINESS NEWS, Nifty, Sensex, Stock Market