స్టాక్ మార్కెట్ పుంజుకుంది!

ఈ వారం ప్రారంభంలో రెండు రోజుల్లో 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. శుక్రవారం సెన్సెక్స్ 372 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు లాభపడ్డాయి.

news18-telugu
Updated: September 14, 2018, 4:49 PM IST
స్టాక్ మార్కెట్ పుంజుకుంది!
ఈ వారం ప్రారంభంలో రెండు రోజుల్లో 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. శుక్రవారం సెన్సెక్స్ 372 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు లాభపడ్డాయి.
  • Share this:
అసలే పరిస్థితులు బాగాలేవు. స్టాక్ మార్కెట్‌లో మళ్లీ నష్టాలు తప్పవా అన్న మదుపర్ల ఆందోళనకు తెరపడింది. నిఫ్టీ, సెన్సెక్స్ కోలుకున్నాయి. శుక్రవారం సెన్సెక్స్ 372 పాయింట్లు, నిఫ్టీ 145 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 38 వేల మార్క్‌ను దాటి 38090.64 దగ్గర నిలిచిపోయింది. గత సెషన్‌తో పోలిస్తే ఏకంగా 0.99 శాతం లాభపడింది సెన్సెక్స్. ఇక నిఫ్టీ 1.28 శాతంతో 145.30 పాయింట్లు పుంజుకుని 11515.20 దగ్గర ఆగింది.

రికార్డు పతనంతో విలవిల్లాడిన రూపాయి మళ్లీ కోలుకోవడం, మదుపర్లు కాస్త ఆచితూచి వ్యవహరించడంతో మార్కెట్లు బలపడ్డాయి. బ్యాంకులు, ఆటోమొబైల్స్, మెటల్స్, ఫార్మా రంగాలు లాభపడ్డాయి. మిడ్‌క్యాప్ సెగ్మెంట్‌ కూడా పుంజుకోవడం మార్కెట్‌కు కలిసొచ్చింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 2 శాతం లాభపడటం విశేషం. వేదాంత, భారతీ ఎయిర్‌టెల్, ఇండియాబుల్స్ హౌజింగ్, బీపీసీఎల్ ఎక్కువగా లాభపడగా, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టపోయాయి.

ఇవి కూడా చదవండి:

ఐఫోన్ ఎక్స్ఎస్: ఏ దేశంలో రేటెంత?భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు!

పెట్రోల్ కొంటారా? పేటీఎం సూపర్ ఆఫర్!

19న షావోమీ ఎంఐ 8 యూత్ లాంఛింగ్!
First published: September 14, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు