నెలరోజుల గరిష్ఠ స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

35,647.62 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్...35,511.10 పాయింట్ల ఇంట్రా డే లో, 35,818.83 ఇంట్రా డే హై మధ్య కదలాడింది.

news18-telugu
Updated: November 19, 2018, 6:02 PM IST
నెలరోజుల గరిష్ఠ స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: November 19, 2018, 6:02 PM IST
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితులు, రూపాయి మారకం విలువ బలపడడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 318 పాయింట్ల లాభం(0.90%)తో 35,775 పాయింట్ల వద్ద నెల రోజుల గరిష్ట స్థాయిలో క్లోజ్ అయ్యింది. అటు నిఫ్టీ కూడా 81 పాయింట్ల లాభంతో 10,763 పాయింట్ల దగ్గర ముగిసింది. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు లాభాల్లో కొనసాగాయి. 35,647.62 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్...35,511.10 పాయింట్ల ఇంట్రా డే లో, 35,818.83 ఇంట్రా డే హై మధ్య కదలాడింది.

యస్ బ్యాంక్, టాటా మోటార్స్, వేదాంత, ఐటీసీ, ఇండసిండ్ బ్యాంక్ షేర్లు రెండు నుంచి ఏడు శాతం మేర లాభపడ్డాయి. ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఏషియల్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

అటు రూపాయి మారకం విలువ బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 28 పైసలు బలపడి 71.64గా ధరపలికింది.

First published: November 19, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...