భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...642 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్...

ఈ రోజు సెషన్లో సెన్సెక్స్‌ ఏకంగా 642 పాయింట్లు పడిపోయి 36,481 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 10,818 వద్ద స్థిరపడింది.

news18-telugu
Updated: September 17, 2019, 6:57 PM IST
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...642 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 17, 2019, 6:57 PM IST
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు సెషన్లో సెన్సెక్స్‌ ఏకంగా 642 పాయింట్లు పడిపోయి 36,481 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 10,818 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో పాటు, రూపాయి విలువ మరింత పతనం కావడంతో ఆటో, బ్యాంకింగ్, మెటల్స్, ఐటీ, ఫార్మా రంగాల్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. మార్కెట్లను భారీగా నష్టపరిచిన స్టాక్స్ లో హీరో మోటో కార్ప్ -6.20 శాతం నష్టపోగా, టాటా మోటార్స్ గరిష్టంగా -5.13 శాతం నష్టపోయింది. అలాగే యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతి సైతం 4 శాతం నష్టపోయాయి.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...