దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 642 పాయింట్లు పడిపోయి 36,481 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 10,818 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో పాటు, రూపాయి విలువ మరింత పతనం కావడంతో ఆటో, బ్యాంకింగ్, మెటల్స్, ఐటీ, ఫార్మా రంగాల్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. మార్కెట్లను భారీగా నష్టపరిచిన స్టాక్స్ లో హీరో మోటో కార్ప్ -6.20 శాతం నష్టపోగా, టాటా మోటార్స్ గరిష్టంగా -5.13 శాతం నష్టపోయింది. అలాగే యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతి సైతం 4 శాతం నష్టపోయాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.