సెన్సెక్స్: రెండు రోజుల్లో 1000 పాయింట్ల పతనం

స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ దారుణంగా పతనమయ్యాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్ 1000 పాయింట్లు పతనమవడం మార్కెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: September 11, 2018, 5:17 PM IST
సెన్సెక్స్: రెండు రోజుల్లో 1000 పాయింట్ల పతనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది స్టాక్ మార్కెట్ కాదు... 'షాక్ మార్కెట్'. దారుణంగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ మదుపరులకు కోలుకోలేని షాకిచ్చింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం ఇది వరుసగా రెండోసారి. సోమవారం సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్లు నష్టపోయాయి. మంగళవారమైనా పరిస్థితి మెరుగవుతుందేమో అనుకుంటే... సోమవారం కన్నా దారుణంగా మారిపోయింది పరిస్థితి. సెన్సెక్స్ ఓ దశలో 515 పాయింట్లు నష్టపోయింది. చివరకు 509 పాయింట్ల నష్టంతో 37,413 పాయింట్ల దగ్గర ఆగింది. సెన్సెక్స్ ఈ స్థాయిలో పడిపోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. మార్చి 16న ఏకంగా 510 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ కూడా నిన్నటి లాగే 151 పాయింట్లు పతనమై 11,287 దగ్గర ఆగింది.

మార్కెట్‌ను కుప్పకూలుస్తున్న 5 అంశాలు

1. రూపాయి పతనం

రూపాయి పతనం కొనసాగుతోంది. ఇండియన్ రుపీ బలహీనమై విలవిల్లాడుతోంది. మంగళవారం ప్రారంభంలో కాస్త స్థిరంగా కనిపించిన రూపాయి 72.74 వరకు పతనమై కొత్త రికార్డులు సృష్టించింది. డాలర్ డిమాండ్‌తో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం మరో కారణం. అయితే రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందని, మళ్లీ రుపీ విలువ బలపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.2. ప్రపంచ అంశాలు
ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధాలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్తంగా ఉంటున్నారు. ఆసియా మార్కెట్లలో మిశ్రమంగా ముగియగా... చైనాలోని షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 31 నెలల్లో బలహీనంగా ముగిసింది. ఇన్వెస్టర్లు ట్రేడ్ వార్‌ విషయంలో అప్రమత్తంగా ఉండటంతో యురోపియన్ మార్కెట్లు నెగిటీవ్‌గా ఉన్నాయి.

3. వాణిజ్య యుద్ధాల భయంఅమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ప్రభావం ఇతర దేశాల మార్కెట్లపై తీవ్రంగా చూపిస్తోంది. అమెరికా ఏవైనా వాణిజ్య నిర్ణయాలు తీసుకుంటే... తాము కూడా బదులు చెప్పాల్సి ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది. అమెరికాపై ఆంక్షలు విధించాలంటూ చైనా వచ్చేవారం వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌ను కలవనుందని తాజా సమాచారం.

4. క్రూడ్ ఆయిల్
ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై అమెరికా ఆంక్షలతో క్రూడాయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇరాన్ క్రూడ్ ఎక్స్‌పోర్ట్స్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో ఇతర కంపెనీలు ఎక్కువగా ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు పెరుగుతున్నాయి.

5. సాంకేతిక కారణాలు
నిఫ్టీ-50 ప్రస్తుతం 50-ఈఎంఏతో 11,300 కన్నా తగ్గింది. ప్రస్తుతం 11,274 దగ్గర ఉంది. తర్వాతి సపోర్టింగ్ లెవెల్స్ 11250, 11200. ఈ ఇండెక్స్ 11,393 దగ్గర్నుంచి పడిపోవడం నెగిటీవ్ పరిణామాలకు కారణం.

ఇవి కూడా చదవండి:

11-09-18

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

 

 
First published: September 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు