స్టాక్ మార్కెట్ క్రాష్!

స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్లు నష్టపోయాయి.

news18-telugu
Updated: September 10, 2018, 4:12 PM IST
స్టాక్ మార్కెట్ క్రాష్!
స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్లు నష్టపోయాయి.
  • Share this:
ఓవైపు రూపాయి పతనం... మరోవైపు పెట్రోల్ ధరల్లో పెరుగుదల... ఈ దెబ్బతో స్టాక్‌ మార్కెట్ దారుణంగా పడిపోయింది. సోమవారం ఒక్కరోజే సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్లు నష్టపోవడం మార్కెట్ వర్గాలకు షాకిచ్చింది. ఉదయం మార్కెట్ నష్టాలతో ప్రారంభమై రోజంతా అదే ట్రెండ్ చూపించింది. మార్కెట్ ప్రారంభమైన తొలి నిమిషం నుంచే అమ్మకాల ఒత్తిడి ఉక్కిరిబిక్కిరి చేసింది. 467 పాయింట్లు పతనమయ్యాక సెన్సెక్స్ 37,922.17 దగ్గర ఆగింది. 151 పాయింట్లు పడిపోవడంతో నిఫ్టీ 11,438.10 పాయింట్లకు పడిపోయింది.

ఆటోమొబైల్స్, బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్స్ లాంటి షేర్లన్నీ నష్టాలబాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్‌‌క్యాప్ రెండు శాతం పడిపోయింది. యాక్సిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ టాప్‌ గెయినర్స్ కాగా, సన్ ఫార్మా, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌజింగ్ టాప్ లూజర్స్. సెన్సెక్స్ 1.22%, నిఫ్టీ 1.30% శాతం పడిపోవడం మార్కెట్ వర్గాల్లో కలవరం రేపుతోంది. మరి రేపు ఎలా ఉంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

రూపాయి పతనంతో మీ జేబుకు చిల్లేనా?Photos: రూపాయి విలువ పతనానికి కారణమేంటీ?

ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్

బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్!89 ఏళ్ల వయస్సులో పీహెచ్‌డీ ఎంట్రెన్స్!

మోటో జీ6 ప్లస్ వచ్చేసింది!

ఐదు నెలల గర్భిణీ ర్యాంప్ వాక్!

ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న 'ఇన్విజిబుల్ ఛాలెంజ్'

Video: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

Video: ఆరోగ్యం కోసం 10 సూపర్‌ఫుడ్స్!

 
First published: September 10, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు