స్టాక్ మార్కెట్ భారీగా పతనం

హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ లాంటి సంస్థలు నష్టాల్లో పయనించాయి. బ్యాంకులు, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఫార్మాసూటికల్స్‌లోనూ నష్టాలు తప్పలేదు. ఐటీ కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి

news18-telugu
Updated: September 24, 2018, 4:08 PM IST
స్టాక్ మార్కెట్ భారీగా పతనం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 536 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్లు పడిపోయాయి. 1.46% పతనంతో సెన్సెక్స్ 36305 పాయింట్ల దగ్గర ఆగగా, నిఫ్టీ 1.58% 11 వేల మార్కు కంటే దిగజారింది. ఉదయం మార్కెట్లు మొదలైనప్పటి నుంచే డౌన్‌ట్రెండ్ కనిపించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల్లో అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఇండియాబుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ లాంటి సంస్థలు నష్టాల్లో పయనించాయి. బ్యాంకులు, ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఫార్మాసూటికల్స్‌లోనూ నష్టాలు తప్పలేదు.

అమెరికా, చైనా మధ్య దిగుమతి సుంకాలు అమల్లోకి రావడంతో మదుపరులు అప్రమత్తమయ్యారు. దీంతో అమ్మకాల జోరు కనిపించింది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ లాంటి ఐటీ కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 80 యూఎస్ డాలర్లకు చేరింది. దీంతో ఏవియేషన్ కంపెనీలపై ప్రభావం కనిపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.64 చేరింది.

ఇవి కూడా చదవండి:

రూ.90 దాటిన లీటర్ పెట్రోల్'ఆయుష్మాన్ భారత్' పథకం గురించి తెలుసా?

గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

డేంజరస్ గేమ్స్‌పై పోరాటానికి ఆన్‌లైన్ గేమ్!
First published: September 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>