Stock Market: స్టాక్ మార్కెట్ బాహుబలి నరేంద్ర మోదీ...సూచీలకు పూనకం...10 ఏళ్ల రికార్డులన్నీ మాయం...

2009 అనంతరం సింగిల్ సెషన్ లో 1400 పాయింట్లకు పైగా సెన్సెక్స్ లాభపడటం ఇదే మొదటి సారి కావడం విశేషం. చివరి సారిగా సెన్సెక్స్ 2009 మే 18న 2110 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ మార్కెట్ క్యాప్ సైతం 150 లక్షల కోట్లు దాటడం విశేషం.

news18-telugu
Updated: May 20, 2019, 5:00 PM IST
Stock Market: స్టాక్ మార్కెట్ బాహుబలి నరేంద్ర మోదీ...సూచీలకు పూనకం...10 ఏళ్ల రికార్డులన్నీ మాయం...
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్, నరేంద్రమోదీ (ఫైల్ చిత్రం)
news18-telugu
Updated: May 20, 2019, 5:00 PM IST
సోమవారం స్టాక్ మార్కెట్లు మోదీ మేనియాతో ఊగిపోయాయి. ఎగ్జిట్ ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఫలితాలు ఇచ్చిన జోష్ తో ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ లు ట్రేడింగ్ ప్రారంభం నుంచే పరుగులెత్తడం ప్రారంభించాయి. ఇంట్రాడేలో నిఫ్టీ ఏకంగా 11845 పాయింట్లను తాకి ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. అలాగే సెన్సెక్స్ సైతం ఇంట్రాడేలో 39,412 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఇదిలా ఉంటే 2009 అనంతరం సింగిల్ సెషన్ లో 1400 పాయింట్లు సెన్సెక్స్ లాభపడటం ఇదే మొదటి సారి కావడం విశేషం. చివరి సారిగా సెన్సెక్స్ 2009 మే 18న 2110 పాయింట్లు లాభపడింది. తాజాగా శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ +421.10 పాయింట్లు లాభఫడి 11,828.25 పాయింట్ల వద్ద ముగియగా, సెన్సెక్స్ +1,421.90 లాభపడి 39,352.67 పాయింట్ల వద్ద ముగిసింది. మరో కీలక సూచీ బ్యాంక్ నిఫ్టీ సైతం +1,309.55 పాయింట్లు లాభపడి 30,759.70 పాయింట్ల వద్ద భారీ లాభాలతో ముగిసింది. మార్కెట్లు ప్రారంభమైన కేవలం 60 సెకన్ల వ్యవధిలో బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.18లక్షల కోట్లు లాభపడ్డాయి. మధ్యాహ్నం 2.45 సమయానికి బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ.151 లక్షల కోట్ల మార్కును తాకడం విశేషం. ఒకే సెషన్ లో మార్కెట్ క్యాప్ రూ. 4,68,000 కోట్లకు ఎగిసింది.

సెక్టార్ పరంగా చూస్తే అన్ని సెక్టార్లు కంప్లీట్ గా ఔట్ పెర్ఫార్మ్ చేశాయనే చెప్పవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 4.45 శాతం లాభపడింది. ఎస్బీఐ 8 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.97 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 4.62 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 8.82 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 9.49 శాతం లాభపడ్డాయి. పీఎన్బీ సైతం 6.77 శాతం లాభఫడింది. అలాగే ఎనర్జీ సెక్టార్ లో భారీగా కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 4.62 శాతం లాభపడింది.

ఆటో సెక్టార్లో సైతం విపరీతంగా కొనుగోళ్లు చేసేందుకు మదుపరులు ఆసక్తి చూపించారు. టాటా మోటార్స్ అత్యధికంగా 7.52 శాతం లాభపడింది. అలాగే మారుతి సుజుకి 5.63 శాతం, ఎం అండ్ ఎం 5.42 శాతం, భారత్ ఫోర్జ్ 7 శాతం, అశోక్ లేల్యాండ్ 3.61 శాతం లాభపడ్డాయి. మెటల్స్ కౌంటర్లో కూడా విపరీతమైన కొనుగోళ్ల రద్దీ కనిపించింది. టాటా స్టీల్ ఏకంగా 3.06 శాతం లాభపడగా, వేదాంత 3.82 శాతం, హిందాల్కో 3.68 శాతం, స్టీల్ అథారిటీ 7.97 శాతం లాభపడ్డాయి.

ఇక నిఫ్టీలో భారీ ర్యాలీకి దోహదపడిన స్టాక్స్ లో హెచ్‌డీ‌ఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్, ఎస్‌బీఐలు పాజిటివ్ కాంట్రిబ్యూటర్స్‌గా ముందువరుసలో ఉన్నాయి. అలాగే నిఫ్టీని నష్టపరిచిన స్టాక్స్‌లో డాక్టర్ రెడ్డీస్, జీ ఎంటర్ టెయిన్ మెంట్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా నెగిటివ్ కాంట్రిబ్యూటర్స్ గా ఉన్నాయి.



టాప్ గెయినర్స్ విషయానికి వస్తే నిఫ్టీ సూచీలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 12.63 శాతం, అదానీ పోర్ట్స్ 8.99 శాతం, ఇండస్ ఇండ్ 8.82 శాతం, ఎస్ బీఐ 7.97 శాతం, టాటా మోటార్స్ 7.52 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్లుగా డాక్టర్ రెడ్డీస్, జీఎంటర్‌టెయిన్‌మెంట్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
First published: May 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...