బ్యాడ్ డే...505 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ట్రేడ్ వార్ భయాలు, రూపాయి క్షీణిత దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

news18-telugu
Updated: September 17, 2018, 7:41 PM IST
బ్యాడ్ డే...505 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ట్రేడ్ వార్ భయాలు, రోజురోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ తదితర పరిణామాలతో సూచీలు నేలచూపులు చూశాయి. దీంతో ఉదయం ప్రారంభ ట్రేడింగ్ నుంచే సూచీలు నష్టాల బాటపట్టాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 505 పాయింట్ల నష్టంతో 37,585 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యింది. 38,028 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్...ఓ దశలో 37,549 పాయింట్ల ఇంట్రా డే లో స్థాయికి పడిపోయింది.

అటు నిఫ్టీ కూడా 137 పాయింట్ల నష్టంతో 11,367 పాయింట్ల వద్ద ముగిసింది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 678 పాయింట్లు లాభపడగా...ఆ లాభాలు సోమవారం ఒక్కరోజే ఆవిరయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్ 505 పాయింట్లు నష్టపోవడంతో మదుపర్ల సంపద ఒకే రోజు దాదాపు రూ.1,14,676.16 నుంచి రూ.1,55,22,343 కోట్లు ఆవిరయ్యింది.


అటు రోజురోజుకూ బక్కచిక్కిపోతున్న రూపాయి విలువ...మరోసారి 72కి దిగువునకు పడిపోయింది. ఫోరెక్స్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.69గా నమోదయ్యింది.
First published: September 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు