సూచీల నేలచూపు...38,000 పాయింట్ల దిగువున సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు, ట్రేడ్ వార్ భయాలు, రూపాయి క్షీణిత తదితర అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

news18-telugu
Updated: September 17, 2018, 11:10 AM IST
సూచీల నేలచూపు...38,000 పాయింట్ల దిగువున సెన్సెక్స్
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు(ఫైల్ ఫోటో)
  • Share this:
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడ్ వార్ భయాలు, రోజురోజుకూ క్షీణిస్తున్న రూపాయి విలువ తదితర పరిణామాల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోయి 38 వేల పాయింట్ల దిగువునకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా 11,400 పాయింట్ల దిగువునకు పడిపోయింది.

కొద్ది సేపటి క్రితం సెన్సెక్స్ 436 పాయింట్ల నష్టంతో 37655 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ కూడా 124 పాయింట్ల నష్టంతో 11,392 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది.


యస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, విప్రో, టెక్ మహీంద్ర షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

డాలర్@రూ.72.64


అటు ఫోరెక్స్‌లో రూపాయి మారకం విలువ క్షీణిత కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72.68 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకు ముందు ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి విలువ 67 పైసలు క్షీణించి 72.52గా ట్రేడ్ అయ్యింది.

శుక్రవారంనాటి ముగింపు 71.85తో పోలిస్తే రూపాయి మారకం 79 పైసలు క్షీణించి 72.64 వద్ద ట్రేడ్ అవుతోంది.
First published: September 17, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>