Home /News /business /

SENIOR CITIZENS WILL MUST KNOW ABOUT THESE FD SCHEMES FOR HIGH RATE OF INTEREST FULL DETAILS HERE HSN GH

Senior Citizens Special FD: 60 ఏళ్ల వయసు దాటిందా..? ఈ స్కీమ్ ల గురించి తెలుసుకోవాల్సిందే.. మార్చి 31 వరకే ఛాన్స్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వైరస్​ నేపథ్యంలో వడ్డీ రేట్లు పడిపోతున్నందున సీనియర్​ సిటిజన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి 2020 మే నెలలో ఈ ప్రత్యేక ఎఫ్​డీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ పథకాన్ని ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు.

మీరు సీనియర్​ సిటిజనా?.. అయితే, మీకు ఇది బిగ్​ అలర్ట్​. ఎందుకంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ), హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అగ్ర శ్రేణి బ్యాంకులు అమలు చేస్తోన్న ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) పథకం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ పథకం కింద ఆయా బ్యాంకులు సీనియర్ సిటిజన్ల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై అదనపు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కరోనా వైరస్​ నేపథ్యంలో వడ్డీ రేట్లు పడిపోతున్నందున సీనియర్​ సిటిజన్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి 2020 మే నెలలో ఈ ప్రత్యేక ఎఫ్​డీ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ పథకాన్ని ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు. తొలుత దీన్ని 2020 సెప్టెంబర్ వరకు అమలు చేయగా.. ఆ తర్వాత 2021 మార్చి 31 వరకు పొడిగించారు. గడువు ముగుస్తున్నందున సీనియర్​ సిటిజన్లు త్వరగా ఎఫ్​డీలో పెట్టుబడులు పెట్టాలని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​, బ్యాంక్​ ఆఫ్​ బరోడా తమ అధికారిక వెబ్‌సైట్లలో కోరాయి. అయితే, స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ) మాత్రం ఈ పథకాన్ని 2021 జూన్ 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ ప్రత్యేక ఎఫ్​డీ పథకం
సీనియర్ సిటిజన్స్​ కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డి పథకాన్ని పథకాన్ని అమలు చేస్తోంది. దీన్ని హెచ్‌డిఎఫ్‌సి సీనియర్ సిటిజన్ కేర్ అంటారు. దీని కింద సీనియర్​ సిటిజన్లు చేసే డిపాజిట్లపై 75 బిపిఎస్ అధిక వడ్డీ రేటు లభిస్తుంది. అనగా సాధారణ కస్టమర్ల కంటే వారికి 0.75 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. ఒక సీనియర్ సిటిజన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సీనియర్ సిటిజెన్ కేర్ ఎఫ్‌డి ఫండ్​లో పెట్టుబడి పెడితే వారికి 6.25% వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు 2021 నవంబర్ 13 నుండి వర్తిస్తాయి.
ఇది కూడా చదవండి: ఏడాది క్రితం పెళ్లయిన కూతురిని ఇంటికి పిలిచి.. అందరం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని చెప్పిన తండ్రి.. చివరకు..

ఐసీఐసీఐ బ్యాంక్ ప్రత్యేక ఎఫ్​డీ పథకం
సీనియర్ సిటిజన్స్ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ స్పెషల్ ఎఫ్​డీ పథకాన్ని అమలు చేస్తోంది. దీన్ని ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ అంటారు. ఈ డిపాజిట్లపై 80 బిపిఎస్ అధిక వడ్డీ రేటును ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్​డీ పథకం కింద సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 6.30 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేట్లు 2021 అక్టోబర్ 21 నుండి అమల్లోకి వస్తాయి.
ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఎఫ్‌డీ పథకం
సీనియర్ సిటిజన్ల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా 100 బిపిఎస్ అధిక వడ్డీని అందిస్తుంది. ఒక సీనియర్ సిటిజన్ స్పెషల్​ ఎఫ్‌డి పథకం కింద 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తే.. వారికి 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ రేట్లు 2021 నవంబర్ 16 నుండి అమల్లోకి వస్తాయి.
First published:

Tags: Business Ideas, BUSINESS NEWS, Investment Plans, Online business, Small business

తదుపరి వార్తలు