బ్యాంకుల్లో అనేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ అందుబాటులో ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత వచ్చిన పెన్షన్ డబ్బుల్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లో దాచుకొని ప్రతీ నెలా వడ్డీ పొందేవాళ్లు ఉంటారు. సాధారణ కస్టమర్లతో పాటు సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ (Fixed Deposit Schemes) ఉంటాయి. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులతో ఉంటాయి. ఇవి కాకుండా సీనియర్ సిటిజన్లకు (Senior Citizen Schemes) ఎక్కువ వడ్డీ ఇచ్చేందుకు ప్రత్యేక స్కీమ్స్ ప్రకటించాయి బ్యాంకులు. అయితే ఈ స్కీమ్స్‌లో చేరడానికి గడువు ఉంటుంది. అప్పట్లోగా చేరాలి. ఇలాంటి రెండు స్కీమ్స్‌లో చేరడానికి 2022 మార్చి 31 చివరి తేదీ.
Bank of Baroda Fixed Deposit Scheme: ప్రభుత్వానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వృద్ధులకు 0.50 శాతం వడ్డీ అదనంగా ఇస్తోంది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. 7 రోజుల నుంచి 3 ఏళ్ల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు టెన్యూర్ ఎంచుకుంటే 0.65 శాతం, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే 1 శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. ఈ స్కీమ్‌లో 2022 మార్చి 31 లోగా చేరితేనే ఈ వడ్డీ వర్తిస్తుంది.
IRCTC BoB Credit Card: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... మీకోసం కొత్త క్రెడిట్ కార్డ్
ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు చూస్తే 7 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 3.3 శాతం, 15 రోజుల నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 4.20 శాతం, 181 రోజుల నుంచి 270 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 4.80 శాతం, 271 రోజుల నుంచి ఒక ఏడాది లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 4.9 శాతం, ఒక ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 5.50 శాతం, ఒక ఏడాది నుంచి 3 ఏళ్ల లోపు టెన్యూర్‌కు 5.70 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల టెన్యూర్‌కు 6 శాతం, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు టెన్యూర్‌కు 6.35 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరితే అదనంగా వడ్డీ పొందొచ్చు.
HDFC Bank FD scheme: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వృద్ధుల కోసం సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్‌డీ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో 0.75 శాతం వడ్డీ అదనంగా పొందొచ్చు. 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 5 ఏళ్ల ఒక రోజు నుంచి 10 ఏళ్ల కాలవ్యవధితో రూ.5 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న వడ్డీ రేట్లు చూస్తే రూ.2 కోట్ల లోపు 30 రోజుల నుంచి 90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 3.50 శాతం, 91 రోజుల నుంచి ఆరు నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 4 శాతం, 6 నెలల నుంచి 1 ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 4.90 శాతం, 1 ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 5.5 శాతం, 2 ఏళ్ల 1 రోజు నుంచి 3 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 5.70 శాతం, 3 ఏళ్ల 1 రోజు నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 5.95 శాతం, 5 ఏళ్ల 1 రోజు నుంచి 10 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 6.35 శాతం వడ్డీ ఇస్తోంది.
Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16 లక్షల రిటర్న్స్
ఇక రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లు చూస్తే 30 రోజుల నుంచి 60 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 3.25 శాతం, 61 రోజుల నుంచి 90 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 3.5 శాతం, 91 రోజుల నుంచి ఆరు నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 3.85 శాతం, 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 4.10 శాతం, 9 నెలల ఒక రోజు నుంచి 1 ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 4.20 శాతం, 1 ఏడాది నుంచి 2 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 4.7 శాతం, 2 ఏళ్ల 1 రోజు నుంచి 3 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 5 శాతం, 3 ఏళ్ల 1 రోజు నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 5.35 శాతం, 5 ఏళ్ల 1 రోజు నుంచి 10 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు 6.35 శాతం వడ్డీ ఇస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank of Baroda, FD rates, Fixed deposits, HDFC bank, Personal Finance