హోమ్ /వార్తలు /బిజినెస్ /

Savings Scheme: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..

Savings Scheme: ఈ స్కీమ్ వాళ్లకు మంచి పెట్టుబడి మార్గం.. పథకం అర్హత, ప్రయోజనాలు ఇవే..

సర్వే రిపోర్ట్ ప్రకారం అనేక సంస్థలు ఉద్యోగుల ప్రదర్శనను బట్టి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇక ప్రమోషన్ విషయానికొస్తే.. 2021లో 12 శాతం మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాయి. ఇక ఉద్యోగ నియామకాల విషయానికొస్తే దాదాపు 78 శాతం కంపెనీలు కరోనా ముందు నాటి పరిస్థితిలో నియామకాలు చేపడుతున్నట్టు వెల్లడించాయి.

సర్వే రిపోర్ట్ ప్రకారం అనేక సంస్థలు ఉద్యోగుల ప్రదర్శనను బట్టి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇక ప్రమోషన్ విషయానికొస్తే.. 2021లో 12 శాతం మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాయి. ఇక ఉద్యోగ నియామకాల విషయానికొస్తే దాదాపు 78 శాతం కంపెనీలు కరోనా ముందు నాటి పరిస్థితిలో నియామకాలు చేపడుతున్నట్టు వెల్లడించాయి.

Savings Scheme: సీనియర్ సిటిజన్లు పెట్టుబడిగా ఎంచుకునే మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందుంటాయి. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్యాంకులు ఎఫ్‌డీల వడ్డీ రేట్లను తగ్గించాయి. ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ మంచి ప్రత్యామ్నాయంగా ఉంది. ఈ స్కీమ్ 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మంచి పెట్టుబడి ఆఫర్స్ అందిస్తుంది. అదేంటంటే..

ఇంకా చదవండి ...

సీనియర్ సిటిజన్లు పెట్టుబడి(Investment)గా ఎంచుకునే మార్గాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed deposits) ముందుంటాయి. అయితే కరోనా(Corona) మహమ్మారి నేపథ్యంలో బ్యాంకులు ఎఫ్‌డీల వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రస్తుతం అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తుండటంతో సీనియర్ సిటిజన్ల(Senior Citizens) పెట్టుబడులపై ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(Saving Schmemes) మంచి ప్రత్యామ్నాయమని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మంచి పెట్టుబడి ఆఫర్స్ అందిస్తుంది.

పదవీ విరమణ పొందిన వారికి ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం పోస్టాఫీస్‌లు(Post Office), ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ స్కీమ్ 2004 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ పథకం కావడం వల్ల ఇందులో సీనియర్ సిటిజన్లు ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. వారు వ్యక్తిగతంగా లేదా ఉమ్మ‌డిగా కూడా అకౌంట్ ఓపెన్(Account Open) చేసుకోవచ్చు. తద్వారా వారు రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్(Income Source) పొందడంతోపాటు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.

ఇది చదవండి: అక్టోబర్​ నుంచి అమల్లోకి నూతన వేతన కోడ్.. వారానికి 3 రోజుల సెలవు.. పనివేళల్లో భారీ మార్పులు..


 అర్హత

ఈ పథకంలో చేరాలంటే కనీసం 60 సంవ‌త్స‌రాలు.. లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. 55-60 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు వారు కూడా ఖాతాలను తెరవచ్చు. అయితే వారు స్వచ్ఛందంగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసివుండాలి. 50 ఏళ్లు పైబడిన డిఫెన్స్ అధికారులకు కూడా దరఖాస్తు(Application) చేసుకునేందుకు అర్హత(Eligibility) ఉంటుంది.కనీసం రూ. 1,000 డిపాజిట్ చేసి ఈ పథకం కింద ఖాతాను తెరవవచ్చు. గరిష్ట డిపాజిట్ పరిమితి (రూ.1,000 నోట్స్ తో) రూ. 15 లక్షల వరకు ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కూడా అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్ శాఖలోనైనా ఖాతా తెరవొచ్చు. సంబంధిత బ్యాంకులో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటే దాని ద్వారా కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

పన్ను ఆదా ప్రయోజనాలు

ఈ పథకంలో రూ.1.5 లక్షల వరకు పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయపు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఆదాయ‌పు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం ఈ టాక్స్ బెనిఫిట్స్ వర్తిస్తాయి. అయితే పథకం ద్వారా సంపాదించిన వడ్డీపై పన్ను కట్టాల్సి ఉంటుందనేది గమనించాలి. ఒక ఆర్ధిక సంవత్సరంలో సంపాదించిన వడ్డీ రూ. 40,000 కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

వడ్డీ రేటు(Intrest Rate):

ఈ పొదుపు వార్షిక వ‌డ్డీ రేటు 7.4 శాతం. ఇది జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.

మెచూరిటీ కాలం:

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ కింద ఖాతా ప్రారంభించిన నాటి నుంచి ఐదేళ్ల కాల‌ప‌రిమితి వ‌ర్తిస్తుంది. తర్వాత దీనిని మరో మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు.

ప్రీమెచూర్ క్లోజింగ్:

రెండేళ్లకు ముందుగానే అకౌంట్ క్లోజ్ చేయాలనుకుంటే.. డిపాజిట్‌(Deposit) మొత్తంపై 0.5 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాల‌ప‌రిమితి ముగియకముందే రెండేళ్ల తర్వాత ఖాతా మూసివేసినా 1 శాతం పెనాల్టీ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: Central governmennt, Investment Plans, Savings

ఉత్తమ కథలు