సీనియర్ సిటిజెన్లకు విమానయాన సంస్థల బంపర్ ఆఫర్

ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు కూడా సీనియర్ సిటిజెన్లకు 6% డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఇది కేవలం దేశీ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.

news18-telugu
Updated: February 4, 2019, 11:10 PM IST
సీనియర్ సిటిజెన్లకు విమానయాన సంస్థల బంపర్ ఆఫర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సీనియర్ సిటిజెన్ల కోసం పలు విమానయాన సంస్థలు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. ఎయిర్ లైన్ టికెట్లపై భారీ తగ్గింపును ప్రకటించాయి. ఆఫర్ ప్రకటించినవాటిల్లో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఏకంగా 50శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. అయితే ఇది కేవలం ఎకానమీ క్లాస్‌కు మాత్రమే వర్తించనుంది. ఈ డిస్కౌంట్ పొందాలనుకునే సీనియర్ సిటిజెన్స్ తప్పనిసరిగా ఇండియాకు చెందినవారై, ఇండియాలోనే నివసిస్తున్నవారై ఉండాలి. దీనికి సంబంధించిన ధ్రువీకరణ కోసం ఏదేని గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది.

రెండేళ్ల లోపు చిన్నారులకు కూడా ఎయిర్ ఇండియా ఆఫర్ ప్రకటించింది. అయితే ఇద్దరు ముగ్గురు పిల్లలతో ప్రయాణించేవారికి.. ఒక చిన్నారికి మాత్రమే ఆఫర్‌ను వర్తింపజేసింది. ఆఫర్ కింద రూ.1000 కూపన్ అందజేస్తోంది.ఇక ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు కూడా సీనియర్ సిటిజెన్లకు 6% డిస్కౌంట్ ప్రకటించాయి. అయితే ఇది కేవలం దేశీ ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా కేవలం టికెట్‌పై మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.విమానంలో ఫుడ్‌పై ఈ డిస్కౌంట్ వర్తించదు.

First published: February 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>