కరోనా వైరస్ మహమ్మారి తర్వాత కంప్యూటర్, ల్యాప్‌టాప్ వినియోగం పెరిగిపోయింది. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ కోర్సుల (Online Courses) కోసం కంప్యూటర్లు ఉపయోగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) కోసం, రిమోట్ వర్క్ కోసం ల్యాప్‌టాప్‌లు వాడక తప్పని పరిస్థితి. అయితే వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కంప్యూటర్, ల్యాప్‌టాప్ కొనే స్థోమత అందరికీ ఉండదు. అలాంటివారికి అద్భుతమైన అవకాశం ఇస్తోంది ఓ స్టార్టప్. సెల్లిజియన్ టెక్నాలజీస్ స్టార్టప్ సబ్స్క్రిప్షన్ పద్ధతిలో కంప్యూటర్స్ ఇస్తోంది. నెలకు కేవలం రూ.399 చెల్లిస్తే చాలు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కంప్యూటర్ ఉపయోగించుకోవచ్చు.
సెల్లిజియన్ ప్రహో పేరుతో కంప్యూటర్ అందుబాటులో ఉంది. రూ.3,600 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. ఆ తర్వాత నెలకు రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి క్లౌడ్ కంప్యూటర్ ఇస్తుంది ఈ స్టార్టప్. ఏ మానిటర్ ఉన్నా కంప్యూటర్ కనెక్ట్ చేయొచ్చు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని క్లౌడ్ కంప్యూటర్ను రూపొందించిన ఈ సంస్థ. క్లౌడ్ కంప్యూటర్ ఉపయోగించాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
Govt Loan: చిరు వ్యాపారులకు రూ.50,000 వరకు లోన్ ఇస్తున్న మోదీ ప్రభుత్వం
Praho is the world’s 1st consumer cloud computer. Conceptualised, designed and developed in India. Available 1st for Indian students for Rs.399/month. Lifetime replacement warranty. Unlimited upgrades. Built-in apps to learn, study, explore. #Selligion #Praho #LetsGetComputing pic.twitter.com/9uCGauimUq
— Selligion Technologies (@selligion) November 4, 2022
విద్యార్థులకు అవసరైన యాప్స్ అన్నీ ఇన్ బిల్ట్‌గా వస్తాయి. బ్రౌజింగ్ కోసం క్రోమ్, షేరింగ్ కోసం వాట్సప్ వెబ్, చదువుకోవడానికి నేషనల్ డిజిటల్ లైబ్రరీ, గూగుల్ క్లాస్ రూమ్, ఉచితంగా ఆన్లైన్ కోర్సుల కోసం స్వయం ఆన్లైన్ లెర్నింగ్, ఆన్లైన్లో కోడ్ నేర్చుకోవడానికి పైచార్మ్ పైథాన్ ఐడీఈ, ఫైల్స్ దాచుకోవడానికి గూగుల్ డ్రైవ్, టాప్ యూనివర్సిటీల కోర్సుల్ని ఆన్లైన్లో నేర్చుకోవడానికి ఎడెక్స్ ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులో ఉంటాయి. ఇన్నీ పొందడానికి నెలకు రూ.399 చెల్లిస్తే చాలు. యాక్టీవ్ సబ్స్క్రిప్షన్ ఉంటేనే కంప్యూటర్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
సబ్స్క్రిప్షన్ పద్ధతిలో కంప్యూటర్ తీసుకోవడానికి ముందుగా రూ.3,600 రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. వాడుకున్నన్ని నెలలు ప్రతీ నెలా రూ.399 చెల్లించాలి. లైఫ్‌టైమ్ రీప్లేస్మెంట్ వారెంటీ లభిస్తుంది. అన్లిమిటెడ్ అప్‌గ్రేడ్స్ కూడా పొందొచ్చు. ఈ కంప్యూటర్ విండోస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేస్తుంది.
Train Live Location: ఏ ట్రైన్ ఎక్కడ ఉంది? పేటీఎంలో సింపుల్‌గా తెలుసుకోండిలా
సెల్లిజియన్ టెక్నాలజీస్ స్టార్టప్ అధికారిక వెబ్సైట్లో https://www.selligion.com/ కంప్యూటర్ బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో స్టార్టప్ తెలిపిన ఉదాహరణ ప్రకారం తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న బేసిక్ కంప్యూటర్ కొనాలంటే కనీసం రూ.25,000 కావాలి. వారెంటే ఒక ఏడాది లభిస్తుంది. ఈ కంప్యూటర్ను మూడేళ్ల వరకు ఉపయోగించుకోవచ్చు. అదే సెల్లిజియన్ ప్రహో కంప్యూటర్ను నెలకు రూ.399 సబ్‌స్క్రిప్షన్‌తో తీసుకుంటే మూడేళ్లకు రూ.15,000 లోపే ఖర్చవుతుంది. లైఫ్‌టైమ్ రీప్లేస్మెంట్ వారెంటీ కూడా ఉంటుంది.
సాధారణంగా కంప్యూటర్ 3 నుంచి 5 ఏళ్ల లోపు ఔట్ డేట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత కంప్యూటర్ మార్చాల్సిందే. కానీ తాము సెల్లిజియన్ ప్రహో క్లౌడ్ బేస్డ్ కంప్యూటర్ కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ లభిస్తాయని ఈ స్టార్టప్ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cloud computing, Computers, JOBS, Start-Up, Startups, Students