తమ ప్లాట్ఫామ్లో సెల్లర్ల కోసం 'గ్రోత్ క్యాపిటల్' పేరుతో ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించింది ఫ్లిప్కార్ట్. ఇ-కామర్స్ సైట్లో రిజిస్టర్ చేసుకున్న ఒక లక్ష మంది సెల్లర్లు 10 నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి 48 గంటల్లో రుణాలు తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.3 కోట్ల వరకు లోన్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది ఫ్లిప్కార్ట్. ఈ రుణాలకు 9.5 శాతం వడ్డీ ఛార్జ్ చేస్తాయి ఫైనాన్షియల్ కంపెనీలు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఫ్లిప్కార్ట్ 'గ్రోత్ క్యాపిటల్' ప్రోగ్రామ్ను రూపొందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, టాటా క్యాపిటల్, ఫ్లెక్సీలోన్స్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లెండింగ్ కార్ట్, ఇండిఫై, హ్యాపీ లోన్స్ సంస్థలు వ్యాపారులకు రుణాలు ఇవ్వనున్నాయి. సగటు లోన్ రూ.7 లక్షలు. లోన్ కాల వ్యవధి 12 నెలలు.

దేశ ఆర్థిక వ్యవస్థకు చిరువ్యాపారాలే వెన్నెముక. దేశీయంగా వృద్ధి చెందిన కంపెనీగా ఫ్లిప్కార్ట్ దేశవ్యాప్తంగా ఉన్న సెల్లర్లకు సాయం చేసేందుకు కట్టుబడి ఉంది. 'గ్రోత్ క్యాపిటల్' ప్రోగ్రామ్ ద్వారా సెల్లర్లు తమ వ్యాపారాన్ని విస్తరించడం, విజయవంతంగా నడపడం, మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించడం, దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడం సాధ్యమవుతుంది.
— కళ్యాణ్ క్రిష్ణమూర్తి, ఫ్లిప్కార్ట్ సీఈఓ
ప్రభుత్వ అంచనా ప్రకారం దేశంలో 6 కోట్లకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలున్నాయి. వీటిలో చాలావరకు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవే. అయితే ఫ్లిప్కార్ట్ రూపొందించిన 'గ్రోత్ క్యాపిటల్' ప్రోగ్రామ్, టెక్నాలజీ, డిజిటల్ ఎకానమీ సాయంతో వ్యాపారులకు, ఆర్థిక సంస్థలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే అవకాశముంది.
Asus 6Z: ఫ్లిప్ కెమెరాతో ఏసుస్ 6జెడ్... ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
Budget 2019: రైతులకు వడ్డీ లేకుండా రూ.1 లక్ష రుణం... బడ్జెట్లో ప్రకటించే అవకాశం
ఇక కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లకు సులువుగా క్లియరెన్స్
Smartphone: మీ ఫోన్ పోయిందా? ఒక్క కాల్తో బ్లాక్ చేయొచ్చుPublished by:Santhosh Kumar S
First published:June 20, 2019, 18:24 IST