Stock Market Today | స్టాక్ మార్కెట్ చాలా చిత్రమైంది. ఎందుకని అనుకుంటారా? ఊరించి ఉసురు మనిపిస్తుంది. భారీ లాభాన్ని కళ్ల ముందు ఉంచుతుంది. తీసుకునేలోపే నష్టాలను మిగిలిస్తుంది. అందుకే స్టాక్ మార్కెట్‌తో (Share Market) చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుగా ఉంటే మాత్రం పెట్టిన డబ్బులు (Money) కూడా పోవొచ్చు. అందుకే ఇన్వెస్ట్ చేసే వారు రిస్క్‌ను ఎప్పుడూ గుర్తించుకోవాలి.
ఇప్పుడు మనం ఒక మల్టీబ్యాగర్ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ స్టాక్ గత ఏడాది కాలంలో భారీ లాభాలు అందించింది. అయితే గత ఆరు నెలల కాలంలో మాత్రం భారీగా పడిపోయింది. ఆ షేరు ఏంటని ఆలోచిస్తున్నారా? అదే ఎస్ఈఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ స్టాక్ ఏడాదిలోనే ఇన్వెస్టర్లను మిలియనీర్లను చేసింది. అయితే ఆరు నెలలో వారికి మళ్లీ బికారులను చేసింది.
మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. కొత్త కారు కొనే వారికి పండగే!
ఏడాది కిందట ఈ షేరు ధర కేవలం రూ. 6.45 మాతర్మే. అయితే ఇప్పుడు ఈ షేరు ధర రూ.599కు చేరింది. అంటే 9 వేల శాతానికి పైగా ర్యాలీ చేసింది. అంటే లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు రూ. 92 లక్షల ప్రాఫిట్ వచ్చి ఉండేది. అయితే ఆరు నెలల కిందట ఈ స్టాక్‌లో డబ్బలు పెట్టిన వారికి భారీ నష్టాలు మిగిలి ఉంటాయి.
రోజుకు రూ.70 పొదుపు చేస్తే రూ.48 లక్షలు పొందొచ్చు! ఈ ఎల్ఐసీ స్కీమ్ గురించి తెలుసా?
ఈ టెక్స్టైల్ కంపెనీ షేరు గత ఆరు నెలల కాలంలో ఏకంగా 60 శాతానికి పైగా పతనమైంది. అంటే ఎవరైనా ఆరు నెలల కిందట ఈ షేరులో రూ. లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆ మొత్తం రూ. 30 వేలకు తగ్గేది. 2022 మే నెలలో ఈ షేరు ధర రూ. 1535 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు రూ. 599కు పడిపోయింది. దాదాపు 61 శాతం క్షీణించింది.
షేరు ధర ఈ స్థాయిలో పడిపోయినా కూడా ఏడాది కాలంలో చూస్తే ఈ స్టాక్ ఇంకా 1250 శాతం మేర రాబడిని అందించిందని చెప్పుకోవచ్చు. అందువల్ల స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే వారు ఇలాంటి విషయాలను కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలి? ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి? అనే దానికి ఈ స్టాక్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks