Car Discounts: కొత్తగా కారు కొనాలనే వారికి గుడ్ న్యూస్.. రూ. 2.55 లక్షల తగ్గింపు..

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా కారు కొనుగోలు చేయాలని చూసేవారికి.. ఇది నిజంగానే గుడ్ న్యూస్. దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి.

  • Share this:
    కొత్తగా కారు కొనుగోలు చేయాలని చూసేవారికి.. ఇది నిజంగానే గుడ్ న్యూస్. దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా కార్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. దేశంలో పలు‌వురు డీలర్లు ఈ అద్భతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఆగస్టు నెలలో కొన్ని ఉత్తత్తులపై కస్టమర్లు ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందేందకు వీలు ఉంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు, కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ రూపంలో కస్టమర్‌లు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీపై అయితే ఎకంగా రూ. రూ.2.55 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే మిగతా మహీంద్ర కార్లపై ఆఫర్స్ ఎలా ఉన్నాయో.. ఎంతవరకు ప్రయోజనం పొందవచ్చన విషయాలను తెలసుకుందాం. అయిత్ మహీంద్రా థార్‌పై మాత్రం ఎలాంటి డిస్కాంట్స్ లేవు.

    Mahindra XUV500: మహీంద్రా ఎక్స్‌యూవీ 500పై రూ .1.79 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ .50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 6,500 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూ . 20,000 విలువైన యాక్ససరీలతో పొందవచ్చు.

    Mahindra Scorpio: స్కార్పియోలో రూ .15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .4,500 కార్పొరేట్ డిస్కౌంట్, రూ .17,000 వరకు యాక్సెసరీలతో అందించబడుతుంది.

    Mahindra Marazzo: మహీంద్రా మరాజోలో డిస్కౌంట్లో రూ. 20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ .15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .5,200 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.

    XUV300: రూ. 10,480 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ .25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్, రూ .5,000 విలువైన యాక్ససరీలతో లభిస్తుంది.

    Mahindra Bolero: మహీంద్రా బొలెరోకు రూ .3,500 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .3,000 కార్పొరేట్ డిస్కౌంట్ మరియు కాంప్లిమెంటరీ నాల్గవ సంవత్సరం వారంటీ లభిస్తుంది. థార్‌పై ఎలాంటి డిస్కౌంట్లు లేవు.
    Published by:Sumanth Kanukula
    First published: