Commercial LPG Connection Rates : ఓవైపు వంట నూనె ధరలు కొండెక్కి కూర్చుంటే మరోవైపు సిలిండర్ ధరలు సామాన్యులకు షాకుల మీద షాకులిస్తున్నాయి ఇప్పటికే వంట గ్యాస్ ధరలు భగ్గుమంటుండగా.. మరోసారి ఎల్పీజీ సిలిండర్లకు సంబంధించి రేట్లు భారీగా పెరిగాయి. సామాన్యులకు షాకిచ్చేలా ఇంధన సంస్థలు తాజాగా చేసిన ప్రకటనతో కొత్త గ్యాస్ కనెక్షన్ పొందడం ఖరీదైనదిగా మారిపోయింది. కొత్తగా ఎల్పీజీ కనెక్షన్ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాల్సిన విషయం తెలిసిందే. సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు రెగ్యులేటర్‌కి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే దేశీయ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ సెక్యూరిటీ డిపాజిట్ రేట్లను(Security Deposit Rates)పెంచిన ఇంధన కంపెనీలు..తాజాగా వాణిజ్య LPG కనెక్షన్ల రేట్లను(Commercial LPG Connection Rates)కూడా భారీగా పెంచాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.1150, 47.5 కిలోల కమర్షియల్ సిలిండర్ పై రూ. 900 పెంచాయి ఇంధన కంపెనీలు కొత్త రేట్లు మంగళవారం (జూన్ 28,2022) నుంచే అమలులోకి వస్తాయి.
కొత్త రేట్ల ప్రకారం..ఇప్పుడు వినియోగదారులు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.3600కి చెల్లించాల్సి ఉంటుంది. 47.5 కిలోల కమర్షియల్ సిలిండర్ కోసం రూ. 7350,సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలి. నిన్నటివరకు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2550గా ఉండగా,47.5 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.6450గా ఉండేది. అంతేకాకుండా, 19 కిలోల సిలిండర్ ను లాట్ వాల్వ్ తో అనుసంధానించడానికి సెక్యూరిటీ డిపాజిట్ ను రూ. 4800 నుండి రూ. 5850 రూపాయలకు పెంచారు. లాట్ వాల్వ్‌తో కూడిన 47.5 కిలోల సిలిండర్ పై సెక్యూరిటీ డిపాజిట్ రూ. 8700 నుండి రూ. 9600 రూపాయలకు పెరిగింది.
Shocking : తనకన్నా 15 ఏళ్లు చిన్నవాడైన అల్లుడితో అత్త ఎఫైర్..చివరికి ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య!
జూన్ 16న నాన్ కమర్షియల్ వంట గ్యాస్ డిపాజిట్ మొత్తాన్ని పెంచుతున్నట్లు ఇంధన కంపెనీలు ప్రకటించిన విషయం తెలిసిందే. గృహ వినియోగ 14.2 కిలోల సిలిండర్ డిపాజిటి ధర రూ.1,450 ఉండగా.. దానిని రూ.2,200లకు పెంచారు. 5 కేజీల సిలిండర్‌పై రూ.800 నుంచి రూ.1,150కి పెంచారు. సిలిండర్ రెగ్యులేటర్ చార్జీలు కూడా భారీగా పెరిగాయి. రెగ్యులేటర్ ధర రూ.150 ఉండగా.. దానిని రూ.250కి పెంచాయి ఇంధన కంపెనీలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Check the Price of LPG, LPG Cylinder, LPG Cylinder New Rates