news18-telugu
Updated: December 1, 2020, 4:59 PM IST
ప్రతీకాత్మకచిత్రం
హౌజింగ్ లోన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) కొన్ని సూచనలు చేసింది. సెక్షన్ 24(b) ప్రకారం హోమ్ లోన్లపై ఇంట్రస్ట్ డిడక్షన్ (interest deduction) లిమిట్‌ను తొలగించాలని.. లేదా డిడక్షన్ లిమిట్‌ను రూ.2,00,000 నుంచి రూ.10,000,000కు పెంచాలని ఫిక్కీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సెక్షన్ 80 సి ప్రకారం హౌజింగ్ లోన్ల రీపేమెంట్‌పై లభించే డిడక్షన్‌ను ఇతర డిడక్షన్లతో కలిపి ఉంచకూడదని, సెక్షన్ 80 సి పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని ఫిక్కీ సూచించింది. ఈ సిఫారసులకు కారణాలను FICCI వివరించింది. “ఉద్యోగాలు చేసేవారు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటారు. కష్టపడి సంపాదించిన డబ్బును లోన్ చెల్లించడానికి ఉపయోగిస్తారు. ఈ డిడక్షన్స్ వారి కొనుగోలు శక్తిని (purchasing power)పెంచుతాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి, ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది” అని ఆ సంస్థ ప్రకటించింది. సెక్షన్ 80-IBA ప్రకారం లభించే డిడక్షన్లను క్లెయిమ్ చేసుకోవడానికి విధిస్తున్న షరతులను సడలించాలని ఈ పరిశ్రమల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
కార్పెట్ ఏరియా లిమిట్‌ను తొలగించాలిప్రస్తుతం దుకాణాలు, వాణిజ్య సంస్థల అగ్రిగేట్ కార్పెట్ ఏరియాపై మూడు శాతం కార్పెట్ ఏరియా లిమిట్ ఉంది. దీంతోపాటు సెక్షన్ 80-ఐబిఎ ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేసినట్లు అధికారుల నుంచి రాతపూర్వకంగా ధ్రువీకరణ పత్రం పొందినప్పుడే ప్రాజెక్ట్ పూర్తయినట్లు భావిస్తారు. ఈ లిమిట్‌ను సడలించాలని FICCI సూచించింది. ప్రాజెక్టును దశలవారీగా పూర్తి చేస్తున్నప్పుడు.. ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ఉన్న ఐదేళ్ల గడువు నిబంధనను సడలించాలని ఆ సంస్థ కోరుతోంది.
ప్రాజెక్టు డెవలప్మెంట్ దశలవారీగా...
ఏదైనా జూరిడిక్షన్ పరిధిలో దుకాణాలు, వాణిజ్య సంస్థల కార్పెట్ ఏరియా, మొత్తం కార్పెట్ ఏరియాలో మూడు శాతంకంటే ఎక్కువగా ఉంటే హౌజింగ్ ప్రాజెక్టులు ముందుకు సాగలేవని FICCI చెబుతోంది. ‘పెద్ద భూభాగంలో, వివిధ భవనాలతో నిర్మించే హౌజింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు, మొత్తం ప్రాజెక్టును ఐదు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయడం కష్టం. అందువల్ల ఇలాంటి భారీ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తిచేస్తారు. ఇలాంటి సందర్భంలో ప్రతి ఫేజ్‌ను పూర్తిచేసేందుకు గడువు ఐదు సంవత్సరాలుగా ఉండాలి. ప్రతి ఫేజ్‌కు అప్రూవల్ తీసుకోవడం దగ్గర నుంచి పూర్తి చేసేంత వరకు ఐదు సంవత్సరాల గడువు అవసరం’ అని ఫిక్కీ వాదిస్తోంది.
Published by:
Krishna Adithya
First published:
December 1, 2020, 4:59 PM IST