హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tax Deductions: పన్ను ఆదా చేసే సెక్షన్ 80C లిమిట్ అయిపోయిందా? అయినా ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు.. ఎలాగంటే..

Tax Deductions: పన్ను ఆదా చేసే సెక్షన్ 80C లిమిట్ అయిపోయిందా? అయినా ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు.. ఎలాగంటే..

సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పన్ను ఆదా చేయడానికి వ్యక్తులు తప్పుడు సమాచారం ఇస్తారు. ఎక్కువ నష్టాన్ని చూపుతారు. అటువంటి పరిస్థితిలో తప్పుడు సమాచారాన్ని నింపినట్లు అనుమానించబడిన వ్యక్తులకు శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది.

సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పన్ను ఆదా చేయడానికి వ్యక్తులు తప్పుడు సమాచారం ఇస్తారు. ఎక్కువ నష్టాన్ని చూపుతారు. అటువంటి పరిస్థితిలో తప్పుడు సమాచారాన్ని నింపినట్లు అనుమానించబడిన వ్యక్తులకు శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది.

ఆదాయ పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసేవారు దృష్టి పెట్టాల్సిన ప్రధాన అంశం.. మినహాయింపులను లెక్కించడం. చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న మినహాయింపులతో (tax deductions) పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

ఆదాయ పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసేవారు దృష్టి పెట్టాల్సిన ప్రధాన అంశం.. మినహాయింపులను లెక్కించడం. చట్ట ప్రకారం అందుబాటులో ఉన్న మినహాయింపులతో (tax deductions) పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పటికే ఉన్న పాత పన్ను విధానంలో ట్యాక్స్ ఆదా చేయడానికి అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఒకవేళ మీరు 2021-22 ఆర్థిక సంవత్సరానికి కొత్త పన్ను విధానాన్ని (NTR) ఎంచుకుంటే, ట్యాక్స్ రాయితీలు పొందలేరు. మీరు పాత లేదా ఇప్పటికే ఉన్న పన్ను విధానాన్ని ఎంచుకుంటే, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C ద్వారా ట్యాక్స్ ఆదా చేసుకోవచ్చు. PPF, NSC, ELSSలో పెట్టుబడులు, పిల్లలకు ట్యూషన్ ఫీజులు, హోమ్ లోన్ EMI చెల్లింపులు, జీవిత బీమా వంటి ఖర్చులపై పన్ను మినహాయింపులు (tax deductions) పొందవచ్చు. అయితే ఈ సెక్షన్ కింద లభించే గరిష్ట పన్ను మినహాయింపు పరిమితి రూ. 1.5 లక్షలు మాత్రమే. అందువల్ల సెక్షన్ 80C కాకుండా ఇతర మార్గాల్లో ట్యాక్స్ భారం తగ్గించుకోవడంపై చాలామంది దృష్టి పెడతారు. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలు ఏవంటే..

NPS అకౌంట్ - సెక్షన్ 80CCD(1B) కింద పన్ను ప్రయోజనాలు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అకౌంట్ ఉన్నవారు, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80CCD(1B) కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ అకౌంట్ లేనివారు కొత్తగా ఎన్‌పీఎస్ అకౌంట్ తీసుకోవచ్చు. ఉద్యోగులు లేదా స్వయం ఉపాధి మార్గం ఉన్నవారు ఈ సెక్షన్ కింద రూ. 50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీ పరిమితి దాటిన సందర్భంలోనే ఈ ప్రయోజనం పొందవచ్చు.

SBI ATM Card: ఈ ఏటీఎం కార్డు ఉందా? రూ.2 లక్షల వరకు ఉచిత ప్రయోజనాలు

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం- సెక్షన్ 80 D

ఈ రోజుల్లో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తున్నారు. కుటుంబసభ్యులు వ్యక్తిగత లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ద్వారా ఆరోగ్య బీమా కవరేజీ పొందడం మంచిది. ఇలాంటి హెల్త్ పాలసీ ప్రీమియంపై ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ప్రస్తుతం 60 ఏళ్లలోపు వారు సెక్షన్ 80 D కింద రూ. 25,000 వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

Amazon Offer: కేవలం రూ. 3 వేలకే Xiaomi 11 Lite NE 5G స్మార్ట్ ఫోన్.. అమెజాన్ లో అదిరే ఆఫర్..

ఇంటి అద్దె- సెక్షన్ 80GG

జీతంలో హెచ్‌ఆర్‌ఏ పొందని, అద్దె ఇంటిలో ఉంటున్నవారు సెక్షన్ 80GG కింద అదనపు పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్రయోజనం పరిమితి నెలకు రూ. 5,000 లేదా సంవత్సర ఆదాయంలో 25% లేదా మొత్తం ఆదాయంలో 10% కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించే అద్దెలో ఏది తక్కువ అయితే అంత వరకు ఉంటుంది.

ఎడ్యుకేషన్ లోన్ చెల్లింపులు- సెక్షన్ 80E

ఉన్నత విద్య కోసం రుణం తీసుకున్నప్పుడు విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై పన్ను ప్రయోజనం పొందవచ్చు. సెక్షన్ 80E కింద క్లెయిమ్ చేయగల వడ్డీపై ద్రవ్య పరిమితి ఉండదు. లోన్ గడువు ముగిసే వరకు లేదా గరిష్టంగా 8 సంవత్సరాలు ఈ ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు.

హోమ్ లోన్ వడ్డీ చెల్లింపు- సెక్షన్ 24

ఒక సంవత్సరంలో హోమ్ లోన్ EMIపై తిరిగి చెల్లించిన ప్రిన్సిపల్ అమౌంట్‌పై సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ప్రధాన మొత్తంపై చెల్లించిన వడ్డీపై సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.

డిపాజిట్ల నుంచి వచ్చే ఆదాయం- సెక్షన్ 80 TTB

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80TTB కింద, డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80 TTB కింద పొందగలిగే గరిష్ట మినహాయింపు పరిమితి సంవత్సరంలో రూ. 50,000 వరకు ఉంటుంది.

కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే మినహాయింపులు వర్తిస్తాయా?

కొత్త పన్ను విధానంలో, పన్ను చెల్లింపుదారులు తక్కువ పన్ను రేట్లను పొందుతారు. అయితే ఇందుకు వీరు చాలా వరకు ఆదాయ పన్ను ప్రయోజనాలను వదులుకోవాల్సి ఉంటుంది. కానీ వీరికి కూడా ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80CCD(2) ప్రకారం మినహాయింపు వర్తిస్తుంది. సెక్షన్ 80CCD(2) అనేది నోటిఫైడ్ పెన్షన్‌కు సంబంధించినది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) వంటి పథకాలకే ఇది వర్తిస్తుంది.

2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2022 వరకు మాత్రమే ఉంది. అంటే 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి పన్ను ప్రయోజనాలను లెక్కించడానికి ఇంకా మూడు నెలల వరకు మాత్రమే సమయం ఉంది. అందువల్ల సెక్షన్ 80సీ పరిమితి దాటితే, ఇతర మార్గాలపై పన్ను చెల్లింపుదారులు దృష్టిపెట్టాలి.

గమనిక: పన్ను చెల్లింపుదారుల అవగాహన కోసమే పన్ను మినహాయింపులకు సంబంధించిన సెక్షన్లను ఇక్కడ పొందుపరిచాం. మరిన్ని వివరాల కోసం ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ ప్లానర్లను సంప్రదించడం మంచిది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

Published by:Nikhil Kumar S
First published:

Tags: Income tax, ITR, ITR Filing, TAX SAVING

ఉత్తమ కథలు