హోమ్ /వార్తలు /బిజినెస్ /

Rolls Royce: రోల్స్ రాయిస్ నుంచి స్పెషల్ కారు.. సరికొత్త ఎక్స్‌టీరియర్ పెయింట్‌తో ఆకట్టుకుంటున్న ‘బోట్ టెయిల్’..

Rolls Royce: రోల్స్ రాయిస్ నుంచి స్పెషల్ కారు.. సరికొత్త ఎక్స్‌టీరియర్ పెయింట్‌తో ఆకట్టుకుంటున్న ‘బోట్ టెయిల్’..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోల్స్ రాయిస్ మోటార్ కార్స్(Rolls Royce Motor Cars) ఇటలీలోని విల్లా డి'ఎస్టేలోని కాంకోర్సో డి ఎలెగాంజాలో బోట్ టైల్ (Rolls-Royce Boat Tail) రెండో మోడల్‌ను లాంచ్‌ చేసింది. ఆల్చిప్ప (mother-of-pearl) కలర్‌ నుంచి పొందిన ప్రేరణతో రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ మోడల్‌ ఎక్స్‌టీరియర్‌ పెయింట్‌ను నిర్ణయించారు.

ఇంకా చదవండి ...

రోల్స్ రాయిస్ మోటార్ కార్స్(Rolls Royce Motor Cars) ఇటలీలోని విల్లా డి'ఎస్టేలోని కాంకోర్సో డి ఎలెగాంజాలో బోట్ టైల్ (Rolls-Royce Boat Tail) రెండో మోడల్‌ను లాంచ్‌ చేసింది. ఆల్చిప్ప (mother-of-pearl) కలర్‌ నుంచి పొందిన ప్రేరణతో రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ మోడల్‌ ఎక్స్‌టీరియర్‌ పెయింట్‌ను నిర్ణయించారు. రెండో రోల్స్ రాయిస్ బోట్ టైల్ బాడీని పూర్తిగా చేతితో నిర్మించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో రేసింగ్ యాచ్‌ల నుంచి ప్రేరణ పొందిన అవుట్‌లైన్‌ను రూపొందించడానికి అల్యూమినియం షీట్‌లను ఉపయోగించి ప్యానెల్‌లు రూపొందించారు.

రోల్స్ రాయిస్ ఈ ప్రత్యేకమైన బోట్ టెయిల్ మోడల్‌ ఫోటోలను షేర్ చేసింది. ఇది అల్ట్రా-ప్రీమియం ఆటో మేకర్ తయారు చేయబోతున్న మూడు మోడళ్లలో ఒకటి. పెర్లింగ్ పరిశ్రమ ద్వారా కుటుంబ వ్యాపారం వృద్ధి చేసిన ఒక వ్యక్తి కోసం దీన్ని రూపొందించారు. క్లయింట్ తన కార్‌కు కావాల్సిన ప్రత్యేకమైన రంగు కోసం నాలుగు ముత్యాల షెల్‌ల ఎంపికతో రోల్స్ రాయిస్ కోచ్‌బిల్డ్ డిజైనర్ల బృందానికి అందించారు. రోల్స్ రాయిస్ షెల్స్ రూపొందించడానికి అవసరమైన ఎక్స్‌టీరియర్‌ కలర్‌ను ఎంచుకొనేందుకు స్ఫూర్తిని అందించాయని చెప్పారు. ఇది ఇప్పటివరకు ఓ కస్టమర్‌ కోసం తయారు చేసిన అత్యంత సంక్లిష్టమైన కార్‌ అని రోల్స్ రాయిస్ పేర్కొంది.

రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ వెనుక డెక్‌లో రాయల్ వాల్‌నట్ వెనీర్ ఉంది, ఇది రోజ్ గోల్డ్-ప్లేటెడ్ పిన్‌స్ట్రైప్స్‌తో ఒక అధునాతన రూపాన్ని అందించడానికి శాటిన్-బ్రష్ ఫినిషింగ్‌ చేశారు. కాలక్రమేణా రంగు నెమ్మదిగా కాగ్నాక్ టోన్ వైపు మారుతుంది. పాంథియోన్ గ్రిల్ అని పిలిచే ప్రత్యేకమైన కారు ఫ్రంట్ గ్రిల్ అల్యూమినియం సింగిల్, సాలిడ్‌ బిల్లెట్ నుంచి రూపొందించిన రోజ్ గోల్డ్‌లోని స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ బానెట్‌ను అలంకరించింది.

Change Interest Rates: ఆ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మారిన సేవింగ్స్ అకౌంట్స్ వడ్డీ రేట్లు..


కోచ్‌బిల్డ్ డిజైన్ హెడ్ అలెక్స్ ఇన్నెస్ ఈ బోట్ టెయిల్ మోడల్ నిజంగా ఒక ప్రత్యేకమైనదని చెప్పారు. ఆయన మాట్లాడుతూ..‘చేతితో మోటారు కారును నిర్మించడం అనేది అన్వేషణ, అవకాశానికి కొత్త మార్గం. సాధారణ పరిశ్రమలు పక్కనబెట్టే పద్ధతుల్లో మేము సవాళ్లను పరిష్కరించగలం.’ అని వివరించారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రోల్స్ రాయిస్ మోటార్ కార్స్, టోర్స్టన్ ముల్లర్-ఓట్వోస్ మాట్లాడుతూ..‘కేవలం అందమైన మోటారు కారు కంటే, రూపొందించిన విధానం ప్రతి క్లయింట్‌కు అసాధారణమైన వ్యక్తిగత, భావోద్వేగాలను ఇస్తుంది. మా డిజైనర్‌లకు కూడా కోచ్‌బిల్డ్ అసమానమైన సృజనాత్మక స్వేచ్ఛను అందిస్తుంది. ఇలాంటివి డిజైన్, మెటీరియల్స్, ఇంజినీరింగ్, హస్తకళను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు.’ అని చెప్పారు.

First published:

Tags: Client, New cars, Paint, Rolls royce