హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cafe Coffee Day: కాఫీ డే కంపెనీకి రూ.26 కోట్ల పెనాల్టీ.. 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశం

Cafe Coffee Day: కాఫీ డే కంపెనీకి రూ.26 కోట్ల పెనాల్టీ.. 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశం

Cafe Coffee Day: కాఫీ డే కంపెనీకి రూ.26 కోట్ల పెనాల్టీ.. 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశం

Cafe Coffee Day: కాఫీ డే కంపెనీకి రూ.26 కోట్ల పెనాల్టీ.. 45 రోజుల్లోగా చెల్లించాలని సెబీ ఆదేశం

Cafe Coffee Day: దేశవ్యాప్తంగా ‘కేఫ్ కాఫీ డే’ ఔట్‌లెట్‌లను నిర్వహిస్తున్న ‘కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(CDEL)కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) భారీ జరిమానా విధించింది. కాఫీ డే కంపెనీకి చెందిన అనుబంధ సంస్థల నుంచి అనైతికంగా నిధులు మళ్లించినందుకు సెబీ రూ.26కోట్ల పెనాల్టీ వేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశవ్యాప్తంగా ‘కేఫ్ కాఫీ డే’ (Cafe Coffee Day) ఔట్‌లెట్‌లను నిర్వహిస్తున్న ‘కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(CDEL)కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) భారీ జరిమానా విధించింది. కాఫీ డే కంపెనీకి చెందిన అనుబంధ సంస్థల నుంచి అనైతికంగా నిధులు మళ్లించారని గుర్తించిన నేపథ్యంలో సెబీ రూ.26కోట్ల పెనాల్టీ వేసింది. 45 రోజుల్లోగా ఈ జరిమానాను చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.

కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు మాజీ అధినేత వి.జి. సిద్ధార్థ్. కంపెనీకి ప్రమోటర్‌గా కూడా సిద్ధార్థ్ వ్యవహరించేవారు. అయితే కంపెనీ ప్రమోటర్ల పేరు మీద మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్(MACEL) అనే మరొక సంస్థ కూడా ఉంది. ఇందులో దాదాపు 91.75శాతం వాటా సిద్ధార్థ్, అతడి కుటుంబ సభ్యులదే. అయితే, కాఫీ డేకి చెందిన 7 అనుబంధ సంస్థల నుంచి నిధులను ఈ మైసూర్ కాఫీ ఎస్టేట్స్‌కి మళ్లించారు. దీంతో భారీ మొత్తంలో సిద్ధార్థ్, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమయ్యాయి. ఈ ప్రక్రియ అనైతికంగా, మోసపూరితంగా జరిగినట్లు సెబీ గుర్తించింది.

* రికవరీ కోసం ఆర్డర్

మైసూర్ అమాల్గమేటెడ్ కాఫీ ఎస్టేట్స్ లిమిటెడ్ నుంచి వీలైనంత త్వరగా బకాయిలు వసూలు చేయాలని సెబీ ఆదేశించింది. ఈ వసూలు ప్రక్రియ కోసం నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజీని సహకారంతో ఓ స్వతంత్ర న్యాయ సంస్థను ఏర్పాటు చేయాలని తెలిపింది.

వడ్డీతో కలిపి మైసూర్ ఎస్టేట్స్ లిమిటెడ్ నుంచి బకాయిలను వసూలు చేయాలని నొక్కి చెప్పింది. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని కాఫీ డేను రెగ్యులేటరీ ఆదేశించింది. అయితే, 2019, జులై నాటికి రూ.3,535 కోట్లు బకాయిలు ఉన్నట్లు సెబీ తెలిపింది. కాగా, 2022 సెప్టెంబరు 30 నాటికి కేవలం రూ.110.75 కోట్లు మాత్రమే వసూలు కావడం గమనార్హం.

* జరిమానా ఇలా..

మోసపూరిత, అనైతిక వాణిజ్య విధానాలకు పాల్పడినందుకు గాను సెబీ రూ.25 కోట్లు జరిమానా విధించింది. అదే విధంగా లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్(LODR) నిబంధనలను ఉల్లంఘించినందుకు కోటి రుపాయిలు ఫైన్ వేసింది. వీటిని 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. దీనిపై కంపెనీ ప్రతినిధులు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : ఇన్‌కం ట్యాక్స్‌ రేట్లు సవరించే యోచనలో ప్రభుత్వం..? లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇదే..

* ఏడు సంస్థలు

కాపీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు 7 అనుబంధ సంస్థలున్నాయి. కాఫీ డే గ్లోబల్, ట్యాంగ్లిన్ డెవలప్‌మెంట్స్, ట్యాంగ్లిన్ రీటెయిల్ రియాలిటీ డెవలప్‌మెంట్స్, గిరి విద్యుత్ లిమిటెడ్, కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్, కాఫీ డే ట్రేడింగ్ అండ్ కాఫీ డే ఎకాన్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. వీటి నుంచే నిధులను సేకరించి ప్రమోటర్లైన సిద్ధార్థ్, అతడి కుటుంబ సభ్యుల కంపెనీలోకి నిధులు దారిమళ్లాయి. తద్వారా వారి వ్యక్తిగత ఖాతాల్లో నిధులు జమయ్యాయని సెబీ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. కాగా, తీర్చలేని అప్పుల కారణంగా కాఫీ డే గ్రూప్ ఛైర్మన్ వి.జి.సిద్ధార్థ 2019లో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

First published:

Tags: Business, Coffee, Sebi

ఉత్తమ కథలు