ఫ్యూచర్ గ్రూప్ (Future Group), రిలయన్స్ రిటైల్ (Reliance retail) డీల్‌కు సెబీ ఆమోద ముద్ర వేసింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్ సేల్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ సముపార్జనకు ది సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ( బుధవారం అంగీకారం తెలిపింది. సెబీ నుంచి క్లియరెన్స్ రావడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల బాట పట్టాయి. గురువారం స్టాక్ మార్కెట్లో రిలయన్స్ జోరు కొనసాగుతోంది. మార్కెట్ ప్రారంభంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం లాభపడింది.
కాగా, ఆగస్టు 29, 2020న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ సంస్థ కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ లో కొన్ని విభాగాలను రూ.24713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌లో ఫ్యూచర్ గ్రూప్‌లో మణిహారంలా పేరుపొందిన రిటైల్ బిజినెస్ విభాగాన్ని ముఖేష్ అంబానీకి అప్పగించింది. ఈ మెగా లావాదేవీతో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన రిటైల్, హోల్ సేల్ విభాగాలు రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌కు (RRFLL) బదిలీ అవుతాయి. RRFLL అనేది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఓ భాగం. కాబట్టి, ఫ్యూచర్ గ్రూప్ నుంచి అవి రిలయన్స్ రిటైల్ గ్రూప్‌నకు బదిలీ అవుతాయి. కాగా, రిలయన్స్, ఫ్యూచర్ డీల్‌కు గత ఏడాది నవంబరులోనే సీసీఐ అంగీకారం తెలిపింది. తాజాగా సెబీ కూడా ఆమోద్రముద్ర వేసింది.
Published by:Shiva Kumar Addula
First published:January 21, 2021, 10:10 IST