ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్ (Sachin Bansal).. ఆ సంస్థను వదిలేసి 2018లో నవీ టెక్నాలజీస్ (Navi Technologies) కంపెనీని స్థాపించారు. దీని ద్వారా ఆయన ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఫిన్‌టెక్ స్టార్టప్ త్వరలో స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. నవీ టెక్నాలజీస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)కు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) తాజాగా ఆమోదం తెలిపింది. కంపెనీలో 97.39 శాతం వాటాను బన్సల్ హోల్డ్ చేస్తున్నారు. తాజాగా ప్రైవేట్ పెట్టుబడిదారుల ద్వారా కాకుండా IPO ద్వారా ఫిన్‌టెక్ అభివృద్ధికి నిధులను సేకరించాలని ప్రయత్నిస్తున్నారు.
సెబీ నుంచి లభించిన ఆమోదం ఫిన్‌టెక్ సంస్థకు ఉపశమనంగా పేర్కొనవచ్చు. ఫిన్‌టెక్ అనుబంధ సంస్థ చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం చేసిన దరఖాస్తును అలాగే మరో ఐదుగురు దరఖాస్తుదారుల పిటిషన్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తిరస్కరించింది.
*రూ.3,350 కోట్ల సమీకరణ లక్ష్యం
నవీ టెక్నాలజీస్ ఫ్రెష్ షేర్స్ ఇష్యూ చేయడం ద్వారా రూ.3,350 కోట్ల వరకు సమీకరించేందుకు ఈ ఏడాది మార్చిలో సెబీకి డ్రాఫ్ట్ పేపర్లు సమర్పించింది. IPOలో వాటాదారుల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉండదు.
IPO ద్వారా వచ్చే ఆదాయాన్ని నవీ ఫిన్సర్వ్, నవీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలో సాధారణ విస్తరణ లక్ష్యాలకు అదనంగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు DRHP పేర్కొంది. SEBI వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఫిన్‌టెక్ సంస్థ సెప్టెంబర్ 5న దాని ఫైలింగ్లకు ప్రతిస్పందనగా అబ్జర్వేషన్ లెటర్ అందుకుంది.
* మైక్రోఫైనాన్స్ రుణాలే అతి పెద్ద మార్కెట్
నవీ టెక్నాలజీస్ అనేది సాంకేతికతతో నడిచే ఆర్థిక ఫైనాన్షియ్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కంపెనీ. కంపెనీ స్థాపించినప్పటి నుంచి.. మ్యూచువల్ ఫండ్స్ , జనరల్ ఇన్సూరెన్స్, హౌస్ లోన్లు, పర్సనల్ లోన్లను అందిస్తోంది. చైతన్య ఇండియా ఫిన్ క్రెడిట్ ద్వారా మైక్రోలోన్లను అందిస్తుంది. నవీ ఫిన్‌టెక్ 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.71.1 కోట్ల లాభాన్ని నమోదు చేయగా, 2022 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ.206.42 కోట్ల నష్టాలను చవిచూసింది.
ఇది కూడా చదవండి : ఐటీ ఉద్యోగులకు వరుస షాకులు.. ఇప్పుడు మరో కంపెనీ స్ట్రాంగ్ వార్నింగ్!
మైక్రోఫైనాన్స్ రుణాలు నవీ అతిపెద్ద మార్కెట్ విభాగం. 2022 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికంలో కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తులు(AUM) రూ.1,808 కోట్లు. ఇదే కాలంలో స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 3.83 శాతంగా ఉన్నాయి. వ్యక్తిగత రుణాల స్థూల ఎన్పీఏలు 1.12 శాతంగా ఉన్నాయి. ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా.. 2021 సెప్టెంబర్ 2న మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్సల్ కొన్ని విషయాలు మాట్లాడారు. మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించేందుకు ఈ రంగంలోకి అడుగుపెట్టినట్టు చెప్పారు. బ్యాంకింగ్ సేవలు, కార్యకలాపాలను చాలా సరళంగా కస్టమర్లకు చేరువ చేస్తామని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, IPO, Sebi