Money | బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. లక్షాధికారులు అయిపోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇండియన్ స్టాక్ మార్కెట్ (Stock Market) రెగ్యులేటర్ సెబీ (Sebi) తాజాగా అదిరిపోయే రివార్డు ప్రకటించింది. ఏకంగా రూ. 20 లక్షల వరకు గెలుపొందొచ్చని వెల్లడించింది. కేవలం ఇన్‌ఫర్మేషన్ ఇస్తే చాలు. ఈ రివార్డును సొంతం చేసుకోవచ్చు.
దేశంల ఎగవేత దారులు చాలా మంది ఉన్నారు. వీరికి సంబంధించిన ఆస్తుల వివరాలను తెలియజేస్తే.. వారికి సెబీ ఈ రూ. 20 లక్షల వరకు రివార్డును అందిస్తుంది. అయితే మీరు ఇచ్చే సమాచారం కచ్చితంగా ఉండాలి. అయితే సెబీ రెండు రకాలుగా పరిహారం అందిస్తుంది. ఇంటీరియం రివార్డు, ఫైనల్ రివార్డ్ అని రెండు రకాలు ఉంటాయి. ఇంటీరియం రివార్డు విషయానికి వస్తే.. రూ. 5 లక్షలు లేదా అసెట్ రిజర్వు ధరలో 2.5 శాతానికి మించకుండా డబ్బులు పొందొచ్చు. ఏది తక్కువ అయితే అది లభిస్తుంది.
నెలకు రూ.500 కట్టండి.. రూ.2,50,000 పొందండి.. బ్యాంక్, పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్!
అదే ఫైనల్ రివార్డు విషయానికి వస్తే.. రూ. 20 లక్షలు లేదా అసెట్‌లో 10 శాతం వరకు పొందొచ్చు. ఏది తక్కువ అయితే అది లభిస్తుంది. కొత్త రివార్డు సిస్టమ్‌పై సెబీ తాజాగా కొత్త నియమ నిబంధనలను జారీ చేసింది. ఎగవేత దారులకు సంబంధించిన ఆస్తుల వివరాలకు సంబంధించి కచ్చితత్వంతో కూడిన సమాచారం అందించిన వారికి మాత్రమే ఈ రివార్డు ప్రయోజనం లభిస్తుందని గుర్తించుకోవాలి.
పీఎం కన్యా ఆశీర్వాద్ స్కీమ్‌తో ఆడ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.1,80,000? కేంద్రం ఏమంటోందంటే..
ఎగవేత దారులకు సంబంధించిన ఆస్తుల సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని సెబీ పేర్కొంది. అలాగే వారికి ఇచ్చిన రివార్డు విషయాన్ని కూడా ఎవ్వరికీ తెలియజేయమని వెల్లడించింది. అందువల్ల సమాచారం ఇచ్చే వారికి ఇలాంటి ఇబ్బంది ఉండదు. స్వేచ్ఛగా వివరాలను అందించొచ్చు. మీరు కచ్చితమైన సమాచారం అందిస్తే.. రూ. 20 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. అంటే లక్షాధికారి అయిపోవచ్చు.
అంతేకాకుండా సెబీ 515 మంది ఎగవేత దారులతో కూడిన ఒక జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ఉన్న వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను తెలియజేయవచ్చు. ఈ రూ. 20 లక్షల వరకు రివార్డు డబ్బులను ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ నుంచి చెల్లిస్తామని సెబీ వెల్లడించింది. సెబీ ఈ మేరకు ఒక ఇన్‌ఫర్మెంట్ రివార్డు కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రికవరీ అండ్ రిఫండ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జనరల్ మేనేజర్, రికవరీ ఆఫీసర్, చీఫ్ జనరల్ మేనేజర్ నామినేట్ చేసే మరో రికవరీ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజన్ గ్రేడ్ అధికారి వంటి తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాగా సెబీ కొత్త రూల్స్ మార్చి 8 నుంచి అమలులోకి వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money, Sebi, Share Market Update, Stock Market