హోమ్ /వార్తలు /బిజినెస్ /

Netra Suraksha: డయాబెటిస్ కంటి సమస్యలతో బాధ పడుతున్నారా.. అయితే మీకు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగకరం..

Netra Suraksha: డయాబెటిస్ కంటి సమస్యలతో బాధ పడుతున్నారా.. అయితే మీకు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగకరం..

Netra Suraksha: డయాబెటిస్ కంటి సమస్యలతో బాధ పడుతున్నారా.. అయితే మీకు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగకరం..

Netra Suraksha: డయాబెటిస్ కంటి సమస్యలతో బాధ పడుతున్నారా.. అయితే మీకు ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగకరం..

భారతదేశం ప్రపంచానికి డయాబెటిస్ కు రాజధాని అనే పేరు ఉంది. ప్రతి నిత్యం ఇండియాలో డయాబెటీస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడెరేషన్ అట్లాస్ 2019లో చేసిన అధ్యయనం ప్రకారం 2019 నాటికి భారతదేశంలోకి పెద్ద వయస్సు వారిలో 77 మిలియన్ మందికి డయాబెటిస్ ఉందని తెలిసింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Telangana, India

  భారతదేశం ప్రపంచానికి డయాబెటిస్ కు(Diabetes) రాజధాని అనే పేరు ఉంది. ప్రతి నిత్యం ఇండియాలో డయాబెటీస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడెరేషన్ అట్లాస్ 2019లో చేసిన అధ్యయనం ప్రకారం 2019 నాటికి భారతదేశంలోకి పెద్ద వయస్సు వారిలో 77 మిలియన్ మందికి డయాబెటిస్ ఉందని తెలిసింది. అంతే కాకుండా.. ఈ సంఖ్య 2030 నాటికి 101 మిలియన్‌కి 2045 నాటికి 134 మిలియన్‌కి చేరుకుంటుందని అంచనా వేసింది. డయాబెటిస్ అనే వ్యాధి సోకితే ఈ ఒక్క వ్యాధితోనే పోదు. దీనితో పాటు.. అనేక అనారోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది. తద్వారా దేశంలో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ ఉన్న వారికి ఎక్కువగాదృష్టి లోపాలు.. అలాగే కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని ద్వారా అంధత్వ సమస్యలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ఈ విధంగా.. డయాబెటిస్ అయిదవ ప్రధాన కారణంగా నిలిచింది. డయాబెటిస్ కారణంగా రెటీనాకు వచ్చే సమస్య, ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించనప్పటికి సరైన సమయంలో గుర్తించకపోతే క్రమక్రమంగా ఇది అంధత్వానికి దారి తీస్తుంది.

  వీటిని ప్రారంభదశలోనే గుర్తించి, వైద్యులు ఇచ్చిన సూచనలను తూచ తప్పకుండా పాటిస్తే.. DR(డయాబెటీస్ రెటినోపతి) వల్ల కంటికి జరిగే నష్టాన్ని నివారించవచ్చు. DR అనేది ఒక స్క్రీనింగ్ పరీక్ష . అలాగే కంటి వైద్యులు చేసే పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. ఇండియాలో ఈ నిర్ధారణ ప్రక్రియ అంత సులుభం కాదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి.

  నివాస ప్రదేశం: మీరు చిన్న పట్టణాలలో లేదా గ్రామాలలో నివాసించే వారు అయితే, మీకు అందుబాటులో తగిన సంఖ్యలో కంటి వైద్య నిపుణులు ఉండటం అనేది సాధ్యం కాకపోవచ్చు. వారు చాలా దూరంలో ఉండి ఉండవచ్చు. దీని కారణంగా రోగుల సంఖ్య ఎక్కువగా ఉండి, వైద్యుని వద్ద ఎక్కువ సమయం వేచి ఉండటం లేదా అపాయింట్‌మెంట్ దొరకపోవడం జరగవచ్చు.

  సమయం: పని చేసే వయస్సులో ఉండి DRతో బాధపడుతున్న వారు కొన్ని సమస్యలను ఎదుర్కొవచ్చు. మీకు అనుకూలమైన సమయం ఉన్నప్పుడు లేదా మీరు పని మధ్యలో డాక్టర్ దగ్గరకి వెళ్ళే అవకాశం ఉంటే మంచిదే. కానీ ఆ సందర్భం లేదకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రత్యేకించి మీరు సెలవు తీసుకోవడం అలాగే దానితో పాటు వచ్చే జీతం నష్టాన్ని భరించలేనప్పుడు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది.

  మీకు సమయంతో ఇబ్బంది లేకుండా, మెట్రోపాలిటన్ నగరంలో మంచి వైద్య సదుపాయాల మధ్య ఉన్నప్పటికీ, కంటి సమస్య ఉన్నవారు వైద్యుల వద్దకు వెళ్లవచ్చు. ఎందుకంటే మీరు DR పరీక్షను ప్రతీ సంవత్సరం చేయించుకోవాలి. ఎందుకంటే ఇది క్రమక్రమంగా పెరుగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు డయాబెటిస్ వచ్చి ఎంత ఎక్కువ కాలం అయితే.. మీకు DR ప్రమాదం అంత ఎక్కువ అవుతుంది.

  భారతదేశంలో దాదాపు 12,000 కంటి వైద్యులు ఉన్నారు (దాదాపు 3500 మంది తర్ఫీదు పొందిన రెటీనా నిపుణులు ఉన్నారు). ఇంతకు ముందు చెప్పినట్టుగానే, భారతదేశంలో 2030 నాటికి 100 మిలియన్ డయాబెటిస్ భాదితులు ఉంటారని అంచనా. అంటే, ప్రతీ 8,333 మంది బాధితులకు ఒక కంటి వైద్యుడు ఉన్నారు. వీరందరికి వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రతీ సంవత్సరం ప్రతీ ఒక్కరికీ DR పరీక్ష నిర్వహించడం దాదాపు అసాధ్యం.

  రెటీనా సొసైటీ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ డాక్టర్ మనీషా అగర్వాల్ ప్రకారం.. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఈ అంతరం గురించి బాగా తెలుసు, ఎక్కువ మంది వ్యక్తులను పరీక్షించడం సాధ్యమయ్యే AI పవర్డ్ సొల్యూషన్‌ల వైపు తమ దృష్టిని మళ్లించిందన్నారు. వాస్తవానికి నిపుణుడు అవసరమయ్యే సందర్భాలలో... ఇవి విరుద్ధమైన లక్ష్యాలుగా అనిపించవచ్చు. DR స్క్రీనింగ్‌కు శిక్షణ పొందిన నేత్ర వైద్యుడు అవసరం అయితే అసలు రోగ నిర్ధారణ , చికిత్స ప్రణాళిక కూడా అవసరం!

  అయితే DRలేని కేసులను గుర్తించి, ఫిల్టర్ చేయగలిగితే ఎలా ఉంటుంది, అప్పుడు వైద్యులు నిజంగా తమ అవసరం ఉన్నవారిపై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. ఇక్కడ AI సమాధానం కావచ్చు.

  టైప్ 2 డయాబెటిస్ ఉన్న 301 రోగులు భారతదేశంలోని టెరిషియరీ కేర్ డయాబెటిక్ సెంటర్ అయిన Remidio వద్ద స్మార్ట్ ఫోన్-ఆధారిత డివైజ్ ‘Fundus on phone’ (FOP) రెటినల్ ఫోటోగ్రఫీ చేయించుకున్నారు. 296 మంది రోగుల రెటినల్ చిత్రాలను గ్రేడ్ చేయగా, 191 (64.5%)లో వైద్య నిపుణులు DRను గుర్తిస్తే AI సాఫ్ట్‌వేర్‌ 203 (68.6%) మందిలో గుర్తించింది, అలాగే దృష్టికి ప్రమాదకరమైన DRను వరుసగా 112 (37.8%) మందిలో అలాగే 146 (49.3%) మందిలో గుర్తించారు.

  AI ప్రోగ్రామ్ చేయబడిన విధానం ఏమిటంటే, DR ఉన్నట్లు అనుమానించినప్పుడు కూడా అది కేసులను ఫ్లాగ్ చేసింది. అందుకే కంటి వైద్యుల కంటే AI సంఖ్యలు ఎక్కువగా ఉన్నాయి. స్పష్టమైన కేసులను మాత్రమే ఫిల్టర్ చేయడమే AI లక్ష్యం.

  రాడికల్ హెల్త్ సహ-వ్యవస్థాపకులు రిటో మైత్రా ప్రకారం.. "రాడికల్ హెల్త్ నిర్మించేది మరియు మేము ప్రచారం చేయాలనుకుంటున్నది కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఆ చిత్రాన్ని చదవగల సామర్థ్యం, ​​తద్వారా అధ్యయనం చేసిన ప్రతి ఒక్క చిత్రం కూడా ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి ప్రాంతంలో రెటీనా నిపుణుడిని కలిగి ఉండటం అవసరం. డయాబెటాలజిస్టులు, కుటుంబ వైద్యులు, ప్రాథమిక సంరక్షణా క్లినిక్‌లు, ప్రభుత్వ సెటప్‌లు, జిల్లా ఆసుపత్రులు... ఇలా ఎక్కడైనా చేయగలిగే పని అన్నారు. రాడికల్ హెల్త్ యొక్క టర్న్‌కీ AI సొల్యూషన్ ఇప్పటికే అనేక ఆరోగ్య నిపుణులు వినియోగిస్తున్నారు.

  AI వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ డాక్టర్ వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు AI మీకు ప్రాథమిక ఫలితాన్ని అందించగలదు. మీకు నిజంగా అవసరమైతే మాత్రమే మీరు డాక్టర్‌ని కలుస్తారు. అంతేకాకుండా.. వైద్య నిపుణులకు అందుబాటులో ఉండటానికి కష్టతరమైన గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరీక్షను సులువగా చేసుకోవచ్చు. శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు పరీక్షను నిర్వహించగలరు. ఫలితం ఆధారంగా.. తదుపరి చికిత్స కోసం ప్రజలను సమీప పట్టణం లేదా నగరంలో ఉన్న కంటి వైద్యుని వద్దకు పంపవచ్చు.

  DR ని సైలెంట్ కిల్లర్ ఆఫ్ సైట్ అంటారు. కానీ అది నిజం అవ్వాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలలో అవగాహన లోపం ప్రధాన సంస్య. అన్నింటికంటే, మధుమేహం ఉన్న ప్రతి వ్యక్తికి వారు ఏటా DR కోసం పరీక్షలు చేయించుకోవాలని తెలిస్తే, ఇది కూడా మనం ఇకపై గుర్తుంచుకోలేని అనేక ఇతర వ్యాధులలో ఒకటిగా మిలిగిపోతుంది. ఈ భారీ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, DR స్క్రీనింగ్ ప్రాముఖ్యతపై అవగాహన లేకపోవడానికి పరిష్కారం కోసం Network 18 Netra Suraksha కార్యక్రమాన్ని Novartisతో కలిసి ప్రారంభించింది. ఇది రెండవ సీజన్, DRపై మరింత అవగాహన పెంచి, అపోహలను తొలగించి, వైద్య పరీక్షల ప్రాముఖ్యతను తెలియచేయడం దీని లక్ష్యం. డయాబెటిక్ రెటీనోపతీ గురించి, దాని వల్ల వచ్చే కంటి ప్రమాదాల నివారణ గురించి మరిన్ని వివరాల కోసం Netra Suraksha వెబ్‌సైట్‌ సందర్శించండి.

  Sources:  

  Pandey SK, Sharma V. World diabetes day 2018: Battling the Emerging Epidemic of Diabetic Retinopathy. Indian J Ophthalmol. 2018 Nov;66(11):1652-1653. Available at:  https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC6213704/ [Accessed 4 Aug 2022] 

  IDF Atlas, International Diabetes Federation, 9th edition, 2019. Available at: https://diabetesatlas.org/atlas/ninth-edition/ [Accessed 4 Aug 2022] 

  Abràmoff MD, Reinhardt JM, Russell SR, Folk JC, Mahajan VB, Niemeijer M, Quellec G. Automated early detection of diabetic retinopathy. Ophthalmology. 2010 Jun;117(6):1147-54. Available at: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2881172/ [Accessed 4 Aug 2022]

  Complications of Diabetes. Available at: https://www.diabetes.org.uk/guide-to-diabetes/complications [Accessed 25 Aug 2022]

  Kumar S, Kumar G, Velu S, et al, Patient and provider perspectives on barriers to screening for diabetic retinopathy: an exploratory study from southern India. BMJ Open 2020;10:e037277. doi: 10.1136/bmjopen-2020-037277. Available at https://bmjopen.bmj.com/content/10/12/e037277 [Accessed on 6 Sep 2022]

  Ramachandran Rajalakshmi, Umesh C Behera, Harsha Bhattacharjee, Taraprasad Das, Clare Gilbert, G V S Murthy, Hira B Pant, Rajan Shukla, SPEED Study group. Spectrum of eye disorders in diabetes (SPEED) in India. Report # 2. Diabetic retinopathy and risk factors for sight threatening diabetic retinopathy in people with type 2 diabetes in India. Indian J Ophthalmol. 2020 Feb;68(Suppl 1):S21-S26.. Available at https://pubmed.ncbi.nlm.nih.gov/31937724/ [Accessed on 25 Aug 2022]

  Rajalakshmi R, Subashini R, Anjana RM, Mohan V. Automated diabetic retinopathy detection in smartphone-based fundus photography using artificial intelligence. Eye (Lond). 2018 Jun;32(6):1138-1144. Available at: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5997766/ [Accessed 4 Aug 2022]

  Revelo AI Homepage. Available at https://revelo.care/ [Accessed 6 Sep 2022]

  Published by:Veera Babu
  First published:

  Tags: Diabetes, Netra Suraksha

  ఉత్తమ కథలు