హోమ్ /వార్తలు /బిజినెస్ /

Best SUV Cars: ఫుల్ క్రేజ్.. ఈ కారును తెగ కొనేస్తున్న జనం!

Best SUV Cars: ఫుల్ క్రేజ్.. ఈ కారును తెగ కొనేస్తున్న జనం!

Best SUV Cars: ఫుల్ క్రేజ్.. ఈ కారును తెగ కొనేస్తున్న జనం!

Best SUV Cars: ఫుల్ క్రేజ్.. ఈ కారును తెగ కొనేస్తున్న జనం!

Mahindra Cars | మీరు కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? అది కూడా ఎస్‌యూవీ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఏ కారును ఎక్కువగా కొంటున్నారో తెలుసుకోవాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Scorpio N | కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? జనాలు ఎక్కువగా ఏ కారు కొంటున్నారో చూడాలి. ఎందుకు ఆ కారుకు (Car) డిమాండ్ ఉందో చెక్ చేసుకోవాలి. బడ్జెట్, ఫీచర్లు వంటి వాటిని గమనించిన తర్వాత మీకు కూడా ఆ కారు నచ్చితే దాన్ని కొనుగోలు చేయొచ్చు. మహీంద్రా (Mahindra) కంపెనీ చెందిన ఈ కారుకు ప్రస్తుతం మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది.

మహీంద్రా స్కార్పియో కారును కస్టమర్లు ఎక్కువగా కొంటున్నారు. కంపెనీ స్కార్పియో అమ్మకాలను గమనిస్తే.. ఈ విషయం తెలుస్తుంది. ఇది మిడ్ సైజ్ ఎస్‌యూవీ. డిసెంబర్ నెలలో మహీంద్రా అమ్మకాలు 19,954 యూనిట్లుగా ఉన్నాయి. 2021 డిసెంబర్‌లో అమ్మకాలు 12,684 యూనిట్లు. అంటే అమ్మకాలు 57 శాతానికి పైగా పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే 2022 నవంబర్ నెలతో పోలిస్తే మాత్రం 2022 డిసెంబర్‌లో అమ్మకాలు తగ్గాయి. నవంబర్‌లో అమ్మకాలు 20,945 యూనిట్లుగా ఉన్నాయి.

బంగారం కొనాలనుకునే వారికి భారీ షాక్.. రూ.6,000 పెరిగిన గోల్డ్ రేటు!

స్కార్పియో ఎన్ , ఎక్స్‌యూవీ 700 కార్లు ఇవి టాప్ 2లో ఉన్నాయి. వీటి మార్కెట్ వాటా 63 శాతంగా ఉంది. ఇక టాటా ఎస్‌యూవీలు హరియర్, సఫారి మార్కెట్ వాటా 18 శాతంగా, ఎంజీ హెక్టర్ మార్కెట్ వాటా 7.9 శాతంగా ఉంది. డిసెంబర్ నెలలో మహీంద్రా స్కార్పియో, ఎస్‌యూవీ 700 టాప్ 2 స్థానాల్లో ఉన్నాయి. స్కార్పియో అమ్మకాలు దాదాపు 300 శాతం పెరిగాయి. 7,003 యూనిట్లుగా నమోదు అయ్యాయి. 2021 డిసెంబర్ నెలలో ఈ అమ్మకాలు కేవలం 1757 యూనిట్లు. నెలవారీగా చూసినా అమ్మకాలు పెరిగాయి. 2022 నవంబర్‌లో అమ్మకాలు 6,455 యూనిట్లుగా ఉన్నాయి.

గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే భారీ తగ్గింపు.. రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్!

ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ 700 అమ్మకాల విషయానికి వస్తే.. వార్షికంగా 41 శాతం పెరుగుదల నమోదు అయ్యింది. అమ్మకాలు డిసెంబర్ నెలలో 5623 యూనిట్లుగా ఉన్నాయి. 2021 డిసెంబర్‌లో అమ్మకాలు 3980 యూనిట్లు. నవంబర్ నెలతో పోలిస్తే అమ్మకాలు 1.37 శాతం తగ్గాయి. 5701 యూనిట్ల నుంచి 5623 యూనిట్లకు క్షీణించాయి. ఇక టాటా హరియర్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో మూడో స్థానంలో ఉంది. ఈ కారు అమ్మకాలు డిసెంబర్ నెలలో 2128 యూనిట్లు ఉన్నాయి. అలాగే ఎంజీ హెక్టార్, హెక్టార్ ప్లస్ అమ్మకాలు కూడా పెరిగాయి. టాటా సఫారీ అమ్మకాలు కూడాపైకి చేరాయి. అయితే వీటి అమ్మకాలు మాత్రం 2000 యూనిట్లకు లోపే ఉన్నాయి. అందువల్ల మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తూ ఉంటే.. ఈ మహీంద్రా టాప్ 2 కార్లను ఒకసారి పరిశీలించొచ్చు.

First published:

Tags: Best cars, Cars, Mahindra and mahindra, Scorpio

ఉత్తమ కథలు