ELSS : చాలా మంది ట్యాక్స్ ఫ్రీ ఫైనాన్షియల్ ప్రొడక్టులలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. ట్యాక్స్ సేవింగ్ స్కీమ్‌లుగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్(ELSS) పాపులర్. ELSS మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపులు, స్థిరమైన రాబడి అందుకునే అవకాశం ఉంటుంది. వీటికి సెక్షన్ 80C కింద ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. ELSSలో ఇన్వెస్ట్‌మెంట్‌లు మూడేళ్లపాటు లాక్-ఇన్ అవుతాయి. లాంగ్ టర్మ్‌లో అధిక రాబడిని అందిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. గత ఐదేళ్లలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ELSS స్కీమ్ 22.75 శాతం రిటర్న్స్ అందించగా, తక్కువగా రాణించిన స్కీమ్ 4.78 శాతం రాబడిని ఇచ్చింది. స్థిరంగా రాణించే స్కీమ్‌లను సెలక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనీకంట్రోల్ అందిస్తున్న బెస్ట్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లను పరిశీలిద్దాం..
Axis Long Term Equity Fund
ఈ స్కీమ్ రూ.31,624 కోట్ల ఆస్తులతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోని ELSS పథకాలలో అతి పెద్దదిగా నిలిచింది. జినేష్ గోపానీ ఈ స్కీమ్ ఫండ్ మేనేజర్. ELSS స్కీమ్‌ల ప్రస్తుత ఫండ్ మేనేజర్‌లతో పోల్చితే, ఆయన ఈ స్కీమ్‌ను దాదాపు 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. క్వాలిటీ ఫోకస్డ్ పోర్ట్‌ఫోలియోలు సక్రమంగా రాణించకపోవడంతో.. CY2021 నుంచి స్కీమ్ పనితీరు దెబ్బతింటోంది.
DSP Tax Saver Fund
రోహిత్ సింఘానియా, కౌశల్ మరూ ఈ స్కీమ్‌ను నిర్వహిస్తున్నారు. ఫండ్ మేనేజర్ విలువపై అవగాహన కలిగి ఉంటారు, స్టాక్‌లను ఎంచుకునే సమయంలో సెక్యూర్ మార్జిన్‌పై దృష్టి పెడతారు. మార్జిన్ సేఫ్టీ కిందకు రాని కొన్ని షేర్లు కూడా పోర్ట్‌ఫోలియో సూచిస్తోంది. బలమైన వృద్ధి సాధ్యమైతే మెరుగైన లాభాలు అందుతాయి.
Canara Robeco Equity Tax Saver Fund
ఈ స్కీమ్‌ను శ్రీదత్తా భండ్వాల్దార్, విశాల్ మిశ్రా నిర్వహిస్తున్నారు. స్కీమ్ పోర్ట్‌ఫోలియో లార్జ్ క్యాప్ స్టాక్‌లు, పెద్ద సైజు మిడ్ క్యాప్ స్టాక్‌లలో ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంది. మంచి క్వాలిటీ కాంపౌండింగ్ బిజినెస్, ఆల్ఫా జనరేటర్‌లు కలిగి ఉండటంతో భండ్వాల్దార్ ప్రసిద్ధి చెందారు . ఇందులో మీడియం టర్మ్స్‌లో రాణించే కంపెనీలు ఉన్నాయి. ఈ పథకం MC30 జాబితాలో కూడా ఉంది.
Kotak Tax Saver Fund
రూ.3,063 కోట్ల ఆస్తుల నిర్వహణలో ఉన్న ఈ స్కీమ్‌ను 2015 ఆగస్టు నుంచి హర్ష్ ఉపాధ్యాయ్ నిర్వహిస్తున్నారు. ఈ స్కీమ్ పోర్ట్‌ఫోలియో అన్ని పరిమాణాల కంపెనీలలో డైవెర్సిఫై అయి ఉంటుంది. ఈ స్కీమ్ MC30 జాబితాలో కనిపించింది.
Invesco India Tax Plan
ఈ స్కీమ్‌ను ధీమంత్ కొఠారి , అమిత్ నిగమ్ నిర్వహిస్తున్నారు. ఈ స్కీమ్ నిర్వహణలో రూ.1916 కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఐదు సంవత్సరాల SIP కోసం సగటున 13.56 శాతం రాబడిని అందించగలిగింది.
IDFC Tax Saver (ELSS) Fund
డేలిన్ పింటో 2016 అక్టోబర్ నుంచి ఈ స్కీమ్‌ను నిర్వహిస్తున్నారు. ELSS కేటగిరీ సగటుతో పోలిస్తే ఈ స్కీమ్ మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయిస్తోంది. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్‌లు అస్థిరంగా ఉండటంతో ఇది కేటగిరీ సగటుతో పోల్చితే పేలవమైన పనితీరుకు దారితీసింది.
మేఘాలలో తేలియాడుతూ: మేఘాలయా @ 50!
Quant Tax Plan
దీనికి ఇంతకు ముందు ఎస్కార్ట్స్ టాక్స్ ప్లాన్ అని పిలిచేవారు. ఈ స్కీమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా పెద్ద, మధ్య, చిన్న పరిమాణాల కంపెనీల షేర్లలో వైవిధ్యమైన ఈక్విటీ పోర్ట్‌ఫోలియోను అందిస్తుంది. ఈ స్కీమ్ను అంకిత్ పాండే, వాసవ్ సహగల్ నిర్వహిస్తారు. ELSS స్కీమ్‌లలో ఈ స్కీమ్ అత్యధిక వ్యయ నిష్పత్తి 2.62 శాతం కలిగి ఉంది.
Bank of India Tax Advantage Fund
ఈ స్కీమ్ మేనేజ్‌మెంట్ కింద రూ.676 కోట్ల అసెట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ స్కీమ్ స్థిరంగా రాణిస్తున్న ఫండ్స్‌లో ముందు వరుసలో ఉంది. 2022 ఏప్రిల్‌లో ఫండ్ నిర్వహణ బాధ్యతను బ్యాంక్ ఆఫ్ ఇండియా AMC, CIO, అలోక్ సింగ్ చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: TAX SAVING