ఒకప్పుడు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ఆ తర్వాత ఏటీఎంలు వచ్చాయి. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు వచ్చింది. టెక్నాలజీ పెరిగిపోతున్నకొద్దీ సామాన్యుల అవసరాలు చాలా సులువుగా తీరిపోతున్నాయి. ఇప్పుడు డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎం కార్డు కూడా అవసరం లేకుండా పోయింది. అకౌంట్ ఉన్న బ్యాంకుకు సంబంధించిన యాప్ ఉంటే చాలు. అందులో డబ్బులు ఎంటర్ చేసి, ఏటీఎంలో పిన్ ఎంటర్ చేస్తే చాలు... క్యాష్ వచ్చేస్తోంది. టెక్నాలజీ ఇంతటితో ఆగిపోలేదు. ఇకపై బ్యాంకింగ్ యాప్స్ కూడా అవసరం లేదు. మీరు రెగ్యులర్‌గా ఉపయోగించే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ఉంటే చాలు. మీరు షాపింగ్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసినట్టు, ఏటీఎంలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని మీరు ఉపయోగించడానికి ఇంకెన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ టెక్నాలజీ వచ్చేస్తోంది.
ఏటీఎం తయారు చేసే ఎన్‌సీఆర్ కార్పొరేషన్ మొదటిసారిగా ఇంటర్‌ఆపరెబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్-ICCW విధానాన్ని లాంఛ్ చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ అంటే యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై ఇది పనిచేస్తోంది. ఎన్‌సీఆర్‌తో చేతులు కలిపిన సిటీ యూనియన్ బ్యాంక్ ఈ కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది. సిటీ యూనియన్ బ్యాంక్ ఇప్పటికే 1,500 ఏటీఎంలను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఏటీఎంలల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు. అంటే మీ ఏటీఎం కార్డు గానీ, మీ బ్యాంకుకు సంబంధించిన యాప్ గానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో యూపీఐ యాప్, ఆ యాప్‌కు మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే చాలు. క్షణాల్లో డబ్బులు డ్రా చేయొచ్చు.
IRCTC: తిరుపతి వెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ పంచ దేవాలయం టూర్ ప్యాకేజీ మీకోసమే
Realme 8: రూ.14,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.549 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే
ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకోండి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్నవారంతా గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే, భీమ్ లాంటి యూపీఐ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఈ యాప్స్‌ని పేమెంట్ చేయడానికి, ఇతరులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి ఉపయోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎలా పేమెంట్స్ చేస్తున్నారో, ఇకపై ఏటీఎంలో కూడా డబ్బులు అలాగే డ్రా చేయొచ్చు. అంటే ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను యూపీఐ యాప్‌లోనే క్యూఆర్ కోడ్ స్కానర్‌తో స్కాన్ చేయాలి. ఆ తర్వాత ఎంతమొత్తం డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేయాలి. అంతే... యూపీఐ యాప్‌లో ప్రాసెస్ పూర్తి కాగానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి.
ECLGS స్కీమ్ గడువు మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వం... రుణాలకు అప్లై చేయండి ఇలా
Special Trains: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు... 66 స్పెషల్ ట్రైన్స్ జాబితా ఇదే
ప్రస్తుతం క్యూఆర్ కోడ్‌తో క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశం సిటీ యూనియన్ బ్యాంకుకు చెందిన 1,500 ఏటీఎంల్లో ఉంది. త్వరలో మిగతా బ్యాంకులు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని తమ కస్టమర్లకు ఇలాంటి సర్వీస్ అందించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం క్యూఆర్ కోడ్ ద్వారా గరిష్టంగా రూ.5,000 మాత్రమే డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AMAZON PAY, ATM, Bank, Banking, BHIM UPI, Google pay, Paytm, Personal Finance, PhonePe, UPI