Bank Fraud | మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్ మార్గాల్లో బ్యాంక్ కస్టమర్ల దగ్గరి నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. కేవైసీ మోసం, పాన్ కార్డు అప్‌డేట్ (Pan Card) మోసం ఇలా ఇప్పటికే మోసగాళ్లు బ్యాంక్ (Bank) కస్టమర్లకు బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. అందువల్ల మీరు గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటే మాత్రం కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
మోసగాళ్లు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఇతరులకు డబ్బులు పంపిస్తారు. తర్వాత కాల్ చేసి డబ్బులు పొరపాటుగా మీ అకౌంట్‌కు వచ్చాయని చెబుతారు. అటుపైన ఆ డబ్బులు తిరిగా పంపాలని కోరతారు. అంటే మీరు ఆ డబ్బులు తిరిగి వారికి పంపిస్తే.. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మోసగాళ్లు వందలు లేదా వేలలో డబ్బులు పంపరు. కేవలం రూ.10 లేదా రూ. 50 ఇలా పంపిస్తారు. చిన్న అమౌంట్ కదా అని మీరు తిరిగి వెనక్కి పంపించే ఛాన్స్ ఉంటుంది.
బంగారం కొనే వారికి పిడుగులాంటి వార్త.. రూ.60 వేలు దాటేసిన ధర, ఈరోజు కొత్త రేట్లు ఇలా!
ఇలా మీరు డబ్బులు వెనక్కి పంపితే.. అప్పుడు మీ మాల్వేర్ ఎటాక్ బారిన పడాల్సి వస్తుంది. ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ నిపుణులు పవర్ దుగ్గల్ మాట్లాడుతూ.. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. మాల్వేర్ అండ్ హ్యుమన్ ఇంజినీరింగ్ స్కామ్‌గా దీన్ని పిలుస్తారని పేర్కొన్నారు. ఈ విధానంలో మోసగాళ్లు మీ అకౌంట్‌కు డబ్బులు పంపిస్తారని, పొరపాటుగా వచ్చాయని కాల్ చేస్తారని, ఆ డబ్బులు తిరిగి వెనక్కి పంపాలని కోరతారని వివరించారు. మీరు డబ్బులు వెనక్కి పంపిస్తే.. మీ అకౌంట్ హ్యాక్ చేస్తారని పేర్కొన్నారు.
రైతులకు బ్యాంక్ శుభవార్త.. నిమిషాల్లో రూ.లక్షా 60 వేల లోన్, ఇంట్లో నుంచే పొందండిలా!
ఎప్పుడైతే ఫోన్‌పే, గూగుల్ పే యూజర్లు ఇలా డబ్బులు వెనక్కి పంపిస్తే.. అప్పుడు వారి డేటా మొత్తం (బ్యాంకింగ్, ఇతర కేవైసీ డాక్యుమెంట్లు (పాన్, ఆధార్ వంటివి)) మోసగాళ్లకు చేరతాయి. అప్పుడు ఈ వివరాలతో మోసగాళ్లు ఫోన్‌పే, గూగుల్ పే యూజర్ల అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారని వివరించారు. అందువల్ల ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వెనక్కి డబ్బులు పంపించకుండా దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి డబ్బులు ఇవ్వడం బెటర్. లేదంటే బ్యాంక్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించండి. ఇలా మీరు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank fraud, Google pay, PhonePe, UPI