news18-telugu
Updated: November 5, 2020, 12:14 PM IST
SC on Loan Moratorium: లోన్ మారటోరియం విచారణను వాయిదా వేసిన సుప్రీం కోర్టు
(ప్రతీకాత్మక చిత్రం)
లోన్ మారటోరియంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీం కోర్టు విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా అందుబాటులో లేనందున కేసును వాయిదా వేసినట్టు తెలుస్తోంది. వడ్డీపై వడ్డీ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు వడ్డీపై వసూలు చేసిన వడ్డీని కస్టమర్లకు తిరిగి జమ చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫిడవిట్ కూడా ఫైల్ చేసింది. దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అక్టోబర్ 14న మొదటిసారి విచారణ జరిగింది. వడ్డీ మాఫీ పథకాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వం కొంత సమయం కోరింది. ఆ తర్వాత విచారణ నవంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. ఈరోజు మరోసారి ఇదే పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. కానీ విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
ప్రీమియం ఆపేసినా బెనిఫిట్స్ పొందొచ్చు... LIC Jeevan Labh policy ప్రత్యేకత ఇదేGold Loan: ఈ విషయాలు తెలుసుకోకుండా గోల్డ్ లోన్ తీసుకుంటే నష్టపోతారు
కరోనా సంక్షోభ కాలంలో మారటోరియం ఎంచుకున్నవారి నుంచి బ్యాంకులు వడ్డీపై వడ్డీ వసూలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వడ్డీపై మళ్లీ వడ్డీ ఎలా వసూలు చేస్తారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. దీనిపై ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ కూడా ఇచ్చింది. వడ్డీపై వసూలు చేసిన వడ్డీని రుణగ్రహీతలకు తిరిగి చెల్లిస్తామని తేల్చి చెప్పింది. రూ.2 కోట్ల లోపు లోన్స్ తీసుకున్నవారందరికీ వడ్డీ రీఇంబర్స్ అవుతోంది. నవంబర్ 5 లోగా అర్హుల ఖాతాల్లోకి వడ్డీని రీఇంబర్స్ చేయాలని ప్రభుత్వం బ్యాంకులకు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 29 లోపు తీసుకున్న రుణాలందరికీ ఇది వర్తిస్తుంది. మారటోరియం ఎంచుకోనివారికి కూడా ఇది వర్తిస్తుంది. అంటే మారటోరియం ఎంచుకోకుండా ఈఎంఐలు చెల్లించిన కస్టమర్లకు వడ్డీ మాఫీ అవుతుంది.
ఇక మారటోరియం కేవలం అసలు, వడ్డీకే వర్తిస్తుంది. వడ్డీపై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అసలుపై వడ్డీని యథాతథంగా చెల్లిస్తే చాలు. పర్సనల్ లోన్, ప్రొఫెషనల్ లోన్, కన్స్యూమర్ లోన్, క్రెడిట్ కార్డ్ బిల్స్, హోమ్ అప్లయెన్సెస్ లోన్, ఆటో లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఎంఎస్ఎంఈ లోన్లకు వడ్డీపై వడ్డీ మాఫీ పథకం వర్తిస్తుంది. వడ్డీపై వసూలు చేసిన వడ్డీని ఎక్స్గ్రేషియా రూపంలో నవంబర్ 5 లోగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇప్పటివరకు ఈ సమాచారాన్ని కస్టమర్లకు చెప్పలేదు. దీంతో కస్టమర్లలో ఆందోళన నెలకొంది.
ATM: వేలి ముద్రతో ఏటీఎంలో డబ్బులు డ్రా చేయండి ఇలా
EPF Balance: దీపావళి నాటికి ఈపీఎఫ్ వడ్డీ మీ అకౌంట్లోకి... చెక్ చేయండి ఇలాకస్టమర్ల నుంచి వసూలు చేసిన చక్రవడ్డీని తిరిగి జమ చేసిన తర్వాత బ్యాంకులు వాటిని ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకు డిసెంబర్ 15 వరకు అవకాశం ఉంది. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.6500 కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా. ఒకవేళ ప్రభుత్వం ఈ క్లెయిమ్స్ని రిజెక్ట్ చేస్తే బ్యాంకులు మళ్లీ కస్టమర్ల నుంచి వడ్డీని వసూలు చేసే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
Published by:
Santhosh Kumar S
First published:
November 5, 2020, 12:14 PM IST