హోమ్ /వార్తలు /బిజినెస్ /

Pension: కేంద్రానికి సుప్రీం షాక్.. ఏప్రిల్ 30 కల్లా ఆ స్కీమ్ కింద వారికి డబ్బులు ఇవ్వాలంటూ ఆదేశాలు!

Pension: కేంద్రానికి సుప్రీం షాక్.. ఏప్రిల్ 30 కల్లా ఆ స్కీమ్ కింద వారికి డబ్బులు ఇవ్వాలంటూ ఆదేశాలు!

 Pension: కేంద్రానికి సుప్రీం షాక్.. ఏప్రిల్ 30 కల్లా ఆ స్కీమ్ కింద వారికి డబ్బులు ఇవ్వాలంటూ ఆదేశాలు!

Pension: కేంద్రానికి సుప్రీం షాక్.. ఏప్రిల్ 30 కల్లా ఆ స్కీమ్ కింద వారికి డబ్బులు ఇవ్వాలంటూ ఆదేశాలు!

Supreme Court | సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరిగతిన చెల్లించాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

One Rank One Pension | దేశీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తాజాగా కేంద్రానికి ఝలక్ ఇచ్చింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) ఎరియర్స్ పేమెంట్ విషయంలో మోదీ (Modi) సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ బకాయిల చెల్లింపుపై కేంద్రం ఇచ్చిన సీల్డ్ కవర్ నోట్‌ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు (SC) సోమవారం నిరాకరించింది. వారికి వెంటనే ఎరియర్స్ డబ్బులు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఒక గడువు కూడా నిర్దేశించింది.

’సుప్రీంకోర్టులో ఈ సీల్డ్ కవర్ ప్రాక్టీస్‌కు స్వస్తి పలకాలి... ఇది ప్రాథమికంగా చూస్తే న్యాయ ప్రక్రియకు విరుద్ధం‘ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, జీబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ‘నేను వ్యక్తిగతంగా సీల్డ్ కవర్ల విషయంలో విముఖంగా ఉన్నాను. కోర్టులో పారదర్శకత ఉండాలి. ఇది ఆదేశాలను అమలు చేయడమే. ఇక్కడ రహస్యంగా ఏమి ఉండగలదు‘ అని సీజేఐ అన్నారు.

అలాంటి వారి ఆధార్ కార్డులు వెంటనే రద్దు.. యూఐడీఏఐ కొత్త విధానం?

కాగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ బకాయిల చెల్లింపుపై ఇండియన్ ఎక్స్-సర్వీస్‌మెన్ మూవ్‌మెంట్ (ఐఈఎస్ఎం) అభ్యర్థనను బెంచ్ ప్రస్తుతం విచారిస్తోంది. ఓఆర్ఓపీ బకాయిలను నాలుగు వాయిదాలలో చెల్లించాలని కేంద్రం గతంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అంశానికి సంబంధించి మార్చి 13న అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. దిగొచ్చిన వెండి!

ఈ క్రమంలోనే 2019-22 సంవత్సరాలకు సంబంధించి మాజీ సైనికులకు రూ. 28,000 కోట్ల బకాయిలను చెల్లించడానికి గడువును ఇస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల సుప్రీంకోర్టులో అఫిడవిట్, సమ్మతి నోట్‌ను దాఖలు చేసింది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. అర్హత కలిగిన ఫ్యామిలీ పెన్షనర్లకు, అలాగే సయుధ దళాలకు చెందిన గ్యాలంట్రీ విజేతలకు ఎరియర్స్ చెల్లించాలని పేర్కొంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఏప్రిల్ 30లోపు వీరికి చెల్లింపులు చేయాలని తెలిపింది.

అలాగే అర్హత కలిగిన పెన్షనర్లకు 70 ఏళ్లకు పైన వయసు ఉంటే.. వారికి జూన్ 30లోపు పేమెంట్ చేయాలని పేర్కొంది. ఇక మిగతా అర్హులకు ఆగస్ట్ 30, నవంబర్ 30, 2024 ఫిబ్రవరి 28 లోపు విడతల వారీగా చెల్లింపులు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 30 కల్లా ఆరు లక్షల మంది ఫ్యామిలీ పెన్షనర్లకు, గ్యాలంట్రీ అవార్డు విజేతలకు చెల్లింపులు పూర్తి కానున్నాయి. అటే చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Pensioners, Pensions, Supreme Court

ఉత్తమ కథలు