• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • SBI ZERO BALANCE ACCOUNT KNOW HOW TO OPEN BASIC SAVINGS BANK DEPOSIT BSBD ACCOUNT IN STATE BANK OF INDIA SS

SBI Zero Balance Account: ఈ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు... ఓపెన్ చేయండిలా

SBI Zero Balance Account: ఈ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు... ఓపెన్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Zero Balance Account | మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ఎస్‌బీఐలో సులువుగా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు.

  • Share this:
    బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమమ్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతుంటారు కస్టమర్లు. బ్యాంకులో ఏ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఏ బ్యాంకు అయినా ప్రతీ అకౌంట్‌కు మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో నిర్ణయిస్తుంది. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు చేస్తుంది. అయితే ప్రతీ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్ ఒకటి ఉంటుంది. ఆ అకౌంట్‌నే బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్-BSBD అంటారు. లేదా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని పిలుస్తారు. అంటే ఎలాంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేని అకౌంట్ అని అర్థం. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఈ అకౌంట్లను అందిస్తుంటాయి బ్యాంకులు.

    LIC Claims: కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ వర్తిస్తుందా?

    Bank Holidays May 2021: మేలో బ్యాంకులకు ఎన్ని సెలవులు ఉన్నాయో తెలుసా?

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కూడా ఈ అకౌంట్ అందిస్తోంది. బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్-BSBD తీసుకుంటే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ డ్రా చేయొచ్చు. మీకు అవసరం ఉన్నట్టుగా వాడుకోవచ్చు. మీ బ్యాలెన్స్ మీ ఇష్టం. జీరో బ్యాలెన్స్ అకౌంట్‌పై ఇతర లాభాలు కూడా ఉన్నాయి. ఇతర అకౌంట్లకు ఉన్నట్టుగా ఛార్జీలు ఉండవు. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. ఉచితంగా ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ లభిస్తుంది. డిపాజిట్లు, విత్‌డ్రాయల్ లంటి సేవలు కూడా ఉచితం. ఈ అకౌంట్ ఆపరేట్ చేయకపోయినా, ఇనాపరేటీవ్‌గా ఉన్న అకౌంట్‌ని తిరిగి యాక్టీవ్ చేయాలన్నా ఛార్జీలు ఉండవు. అకౌంట్ క్లోజ్ చేయడానికి కూడా ఛార్జీలు ఉండవు.

    e-PAN Card: ఇ-పాన్ కార్డ్ 10 నిమిషాల్లో తీసుకోవచ్చు... ఈ స్టెప్స్ ఫాలో అవండి

    Aadhaar Card: ఆధార్ కార్డు పోయిందా? ఒక్క ఎస్ఎంఎస్‌తో ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు ఇలా

    జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో నాలుగు ట్రాన్సాక్షన్స్ ఉచితం. అంటే నెలలో నాలుగు సార్లు ఎస్‌బీఐ ఏటీఎం లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలల్లో ఉచితంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలు ఉచితం. ఇక రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు వర్తించినట్టుగానే జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు వడ్డీ ఉంటుంది. రూ.1,00,000 కన్నా ఎక్కువ డిపాజిట్లపై వార్షికంగా 2.70 శాతం పైనే వడ్డీ లభిస్తుంది. అన్ని ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇందుకోసం బ్యాంకుకు వెళ్లి, బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్-BSBD ఫామ్ పూర్తి చేసి, కేవైసీ పూర్తి చేస్తే చాలు.
    Published by:Santhosh Kumar S
    First published: