SBI Offers | మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే శుభవార్త. మీకోసం దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ - SBI) అదిరే ఆఫర్లు తీసుకువచ్చింది. పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. కొత్త కారు కొనే వారు ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటు, తక్కువ ఈఎంఐ (EMI) వంటి ప్రయోజనాలు పొందొచ్చు. ఏ ఏ మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు అందబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
ఎస్‌బీఐ హ్యాందాయ్ కార్లప అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. తక్కువ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చు. గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై ఈఎంఐ రూ. 8433 నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే హ్యుందాయ్ క్రెటా కారుపై ఈఎంఐ రూ. 16,342 నుంచి ఉంది. ఇంకా హ్యుందాయ్ శాంట్రో కారుపై అయితే ఈఎంఐ రూ. 7733 నుంచి ప్రారంభం అవుతోంది. అలాగే హ్యుందాయ్ ఐ20 మోడల్‌పై ఈఎంఐ రూ. 11,107 నుంచి ఉంది.
లోన్ తీసుకునే వారికి శుభవార్త.. ఈ బ్యాంకుల్లో రూపాయి కన్నా తక్కువ వడ్డీకే రుణాలు!
ఇంకా హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారుపై ఈఎంఐ రూ. 37,855 నుంచి ప్రారంభం అవుతోంది. హ్యుందాయ్ న్యూ వెర్నా మోడల్‌పై ఈఎంఐ రూ. 14,830 నుంచి ఉంది. హ్యుందాయ్ ఆరా కారుపై ఈఎంఐ రూ. 9547 నుంచి స్టార్ట్ అవుతోంది. హ్యుందాయ్ ఎలెంట్రా మోడల్‌పై ఈఎంఐ రూ. 28,419గా ఉంది. ఇంకా వెన్యూ మోడల్‌పై ఈఎంఐ రూ. 12,395 నుంచి స్టార్ట్ అవుతోంది. హ్యుందాయ్ టస్కన్ కారుపై ఈఎంఐ రూ. 36,104గా ఉంది. ఇక అల్కాజర్ మోడల్‌పై ఈఎంఐ రూ. 26 వేల నుంచి ప్రారంభం అవుతోంది.
షాకుల మీద షాకులు.. ఈరోజూ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే!
Drift the way for your new car with YONO SBI. Find your dream car and know offers on Car Loans all at once on the YONO SBI Mobile App Download the app or visit https://t.co/GEQf43EoZC to know more.#SBI #AmritMahotsav #HarEkKeLiyeKuchSpecial #YONOSBI #CarLoan pic.twitter.com/8sX5Dh84Yk
— State Bank of India (@TheOfficialSBI) March 17, 2023
అదే టయోటా మోడళ్ల విషయానికి వస్తే.. ఇన్నోవా క్రిస్టా కారుపై ఈఎంఐ రూ. 28,419గా ఉంది. ఫార్చునర్ కారు కొనాలంటే నెలకు రూ. 50,584 ఈఎంఐ కట్టాలి. అదే గ్లాంజా కారు అయితే నెలకు రూ. 10,168 ఈఎంఐ పడుతుంది. ఇంకా అర్బన్ క్రూయిజర్ కారు ఈఎంఐ రూ. 14,114గా ఉంది. టాటా కార్ల విషయానికి వస్తే.. టియాగో కారు ఈఎంఐ రూ. 8545గా ఉంటుంది. నెక్సన్ కారుపై రూ. 11,455గా ఉంది. నెక్షన్ ఈవీ అయితే రూ. 23 వేల ఈఎంఐ పడుతుంది. టిగోర్ కారుపై రూ. 9499 ఈఎంఐ ఉంది. అల్ట్రోజ్ కారుపై ఈఎంఐ రూ. 9850గా పడుతుంది.
హరియర్ కారుపై రూ. 23,295గా ఈఎంఐ ఉంటుంది. టాటా పంచ్ కారు అయితే రూ. 9277 ఈఎంఐ పడుతుంది. టిగోర్ ఈవీ అయితే ఈఎంఐ రూ. 19,476గా, సఫారీ అయితే రూ. 24,266గా, టియాగో సీఎన్‌జీ అయితే రూ. 9993గా, టిగోర్ సీఎన్‌జీ అయితే రూ. 12,491గా ఈఎంఐ ఉంది. కియా కారుపై ఈఎంఐ రూ.11 వేల నుంచి ఉంది. ఈ ఈఎంఐలు 84 నెలలకు వర్తిస్తాయి. బ్యాంక్ కారు లోన్స్2పై 8.65 శాతం వడ్డీని వసూలు చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank news, Banks, Car loans, Sbi, State bank of india