SBI YONO App Features | ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సేవల్ని SBI YONO యాప్‌లో పొందొచ్చు. చెక్ బుక్, డెబిట్ కార్డ్ రిక్వెస్ట్ చేయడం, ఏటీఎం పిన్ జెనరేట్ చేయడం, డెబిట్ కార్డ్ బ్లాక్ చేయడం కూడా యోనో యాప్‌తో సాధ్యం.
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? మరి కస్టమర్ల కోసం ఎస్బీఐ తీసుకొచ్చిన యోనో యాప్ గురించి తెలుసా? ఏటీఎం కార్డు లేకపోయినా SBI YONO యాప్‌తో డబ్బులు డ్రా చేసే సదుపాయం కల్పించడంతో ఈ యాప్ వార్తల్లోకి వచ్చింది. YONO అంటే You Only Need One. 2017లో ఈ సరికొత్త సేవల్ని ప్రారంభించింది ఎస్బీఐ. SBI YONO యాప్‌తో పాటు వెబ్సైట్ కూడా ఉంది. ఈ ప్లాట్‌ఫామ్స్‌పై బ్యాంకింగ్ సేవలు, ఇన్వెస్టింగ్, ఇన్స్యూరెన్స్... ఇలా అనేక రకాల సేవలు ఉపయోగించుకోవచ్చు.
1. బ్యాంకింగ్ సేవలు
అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించడం, బెనిఫీషియరీని యాడ్ చేయడం లాంటివి యోనో యాప్‌తో సాధ్యం. ఇందుకోసం మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ సేవల్ని SBI YONO యాప్‌లో పొందొచ్చు. చెక్ బుక్, డెబిట్ కార్డ్ రిక్వెస్ట్ చేయడం, ఏటీఎం పిన్ జెనరేట్ చేయడం, డెబిట్ కార్డ్ బ్లాక్ చేయడం కూడా యోనో యాప్‌తో సాధ్యం. కొత్తగా యాడ్ చేసిన బెనిఫీషియరీకి రూ.10,000 వరకు డబ్బులు పంపొచ్చు.
మీకు హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే యోనో యాప్‌లో దరఖాస్తు చేయొచ్చు. మీ ట్రాక్ రికార్డును బట్టి ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రూ.5 లక్షల వరకు ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఆఫర్ చేస్తుంది బ్యాంకు.
3. SIA బాట్
మీరు యోనో సదుపాయాన్ని SIA బాట్ ఉపయోగించొచ్చు. ఎస్బీఐ కస్టమర్ కేర్‌కు కాల్ చేయకుండానే మీ ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్లు, బిల్ పేమెంట్స్, లోన్స్, షాపింగ్... లాంటి సమస్త సమాచారం పొందొచ్చు.
మీ ఇన్వెస్ట్మెంట్స్, కార్డ్స్, ఇన్స్యూరెన్స్, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సమాచారమంతా ఒకే డ్యాష్‌బోర్డ్‌పై కనిపిస్తుంది. ఈ సమాచారం కోసం మీరు వేర్వేరు వెబ్సైట్లు చూడాల్సిన అవసరం లేదు.
5. షాపింగ్
ఇక యోనో యాప్‌లో షాపింగ్ సదుపాయం కూడా ఉంది. సినిమా టికెట్లు కొనొచ్చు. ట్రావెల్ టికెట్లు బుక్ చేయొచ్చు. డిస్కౌంట్ ఆఫర్లు కూడా లభిస్తుంటాయి.
Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.