SBI Education loan: విదేశీ విద్యకు ఎస్​బీఐ స్పెషల్ ఎడ్యుకేషన్ లోన్.. పూర్తి వివరాలు

(ప్రతీకాత్మక చిత్రం)

విద్యా వ్యయాలు గణనీయంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో చాలా మంది విద్యా రుణాలపైనే ఆధారపడుతున్నారు. ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేని విద్యార్థుల కోసం దేశీయ అతిపెద్ద రుణదాత స్టేట్​బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గ్లోబల్ ఎడ్-వాంటేజ్ (SBI Global Ed-Vantage) పేరుతో ఎడ్యుకేషన్​ లోన్​ ప్రారంభించింది.

  • Share this:
సాధారణంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు బ్యాంకు లోన్లు తీసుకుంటారు. కరోనా కారణంగా కొంత కాలం విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అడ్మిషన్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే విద్యా వ్యయాలు గణనీయంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో చాలా మంది విద్యా రుణాలపైనే ఆధారపడుతున్నారు. ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేని విద్యార్థుల కోసం దేశీయ అతిపెద్ద రుణదాత స్టేట్​బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గ్లోబల్ ఎడ్-వాంటేజ్ (SBI Global Ed-Vantage) పేరుతో ఎడ్యుకేషన్​ లోన్​ ప్రారంభించింది. విదేశీ యూనివర్సిటీల్లో ఫుల్​టైం రెగ్యులర్ కోర్సులు అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం దీన్ని రూపొందించింది. ఎస్‌బిఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ ఎడ్యుకేషన్ లోన్ కింద వడ్డీ రేట్లు, ప్రయోజనాలు, ఫీచర్ల వివరాలను పరిశీలిద్దాం.

8.65 శాతం వడ్డీకే..
ఎస్​బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ లోన్ స్కీమ్ కింద విదేశాల్లో రెగ్యులర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ / డాక్టరేట్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు రుణాలు అందిస్తుంది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరోప్, జపాన్, సింగపూర్, హాంకాంగ్, న్యూజిలాండ్‌ దేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు ఈ రుణాలను మంజూరు చేస్తుంది. రూ. 7.50 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు రుణాలు పొందవచ్చు. ఈ రుణాలకు 8.65 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇక, మహిళా దరఖాస్తుదారులకు ప్రత్యేకంగా 0.50% వడ్డీ రాయితీ లభిస్తుంది. కోర్సు పూర్తయిన 6 నెలల తర్వాత ఈఎంఐ చెల్లించడం ప్రారంభమవుతుంది. రుణాన్ని చెల్లించడానికి గరిష్టంగా 15 సంవత్సరాల సమయం ఉంటుంది.

ఎలాంటి ఖర్చులకు రుణం?
విమానం ప్రయాణ వ్యయం, ట్యూషన్ ఫీజు, పరీక్ష/లైబ్రరీ/ల్యాబ్ ఫీజు, పుస్తకాలు/యూనిఫాం/కంప్యూటర్ ఫీజులు, ప్రాజెక్ట్ వర్క్/థీసిస్/స్టడీ టూర్లకు అయ్యే ఖర్చుకు రుణాన్ని మంజూరు చేస్తారు.

స్కీమ్​ ప్రయోజనాలు
వెబ్‌సైట్ ద్వారా సౌకర్యవంతమైన, వేగవంతమైన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ఉంటుంది. వేగవంతమైన అప్రూవల్​ ప్రాసెస్​తో పాటు I-20/వీసా జారీ కాక ముందే మొత్తం రుణాన్ని విడుదల చేస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 (E) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. దీంతోపాటు ట్యూషన్ ఫీజును నేరుగా యూనివర్సిటీకే చెల్లిస్తుంది.

అవసరమయ్యే డాక్యుమెంట్లు
ఈ లోన్‌ కోసం దరఖాస్తు చేసుకునేవారు 10 వ తరగతి, 12వ తరగతి మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్, ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిషన్ ప్రూఫ్​గా యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్/ఆఫర్ లెటర్/ఐడి కార్డ్ వంటివి, కోర్సుకు అయ్యే మొత్తం ఖర్చుల వివరాలు, స్కాలర్‌షిప్, ఫ్రీ-షిప్​కు సంబంధించిన డాక్యుమెంట్లను అందించాలి.

గ్యాప్ సర్టిఫికేట్ (స్టడీస్‌లో మధ్యలో గ్యాప్ ఉన్న వారికి మాత్రమే), విద్యార్థి / తల్లిదండ్రులు / గ్యారెంటర్​ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (ప్రతి 1 కాపీ). కో అప్లికెంట్​/గ్యారెంటర్​ అసెట్​ లయబెలిటీ స్టేట్​మెంట్​ (రూ. 7.50 లక్షలకు మించిన రుణాలకు వర్తిస్తుంది) సైతం అవసరం అవుతాయి. ఒకవేళ కో అప్లికెంట్​ ఉద్యోగం చేస్తున్నట్లైతే అతని లేటెస్ట్ పే స్లిప్​, ఫారం 16 సబ్​మిట్​ చేయాల్సి ఉంటుంది.

వ్యాపారం చేసే వారి విషయంలో బిజినెస్​ అడ్రస్​ ప్రూఫ్​, తాజా ఐటీ రిటర్న్స్, ఆరు నెలల బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్జజ విద్యార్థి / తల్లిదండ్రులు / గ్యారెంటర్​ పాన్ కార్డు... విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డు కాపీ
పాస్​పోర్ట్​/ డ్రైవింగ్ లైసెన్స్/ ఓటరు ఐడీ కార్డ్.. వంటి అన్ని డాక్యుమెంట్లను బ్యాంకులకు అందించాలి.
Published by:Kishore Akkaladevi
First published: