SBI WE CARE: సీనియర్ సిటిజన్లకు ఎస్​బీఐ గుడ్​న్యూస్​.. ఆ స్కీమ్ గడువు పొడిగింపు

(ప్రతీకాత్మక చిత్రం)

SBI We care scheme: సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ స్పెషల్​ ఎఫ్‌డి స్కీమ్ కింద ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు డిపాజిట్​ చేస్తే 30 బేసిస్​ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది.

  • Share this:
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) సీనియర్​ సిటిజన్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. వారి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ‘వీకేర్​ సీనియర్​​ సిటిజన్స్​ టర్మ్​ డిపాజిట్​ స్కీమ్ (We care senior citizens term deposit scheme)’​ గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమ్​ 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి, మొదట్లో ఈ స్కీమ్ గడువు సెప్టెంబర్ 2020 వరకే ఉండేది. కానీ, కోవిడ్ -19  (Covid-19) మహమ్మారి కారణంగా ఎస్​బీఐ (State Bank of India) అనేకసార్లు పొడిగిస్తూ వస్తోంది. గతంలో పేర్కొన్న నోటిఫికేషన్​ ప్రకారం, ఈ స్కీమ్​ గడువు ఈ రోజు(సెప్టెంబర్​ 30)తో ముగియాల్సి ఉంది. కానీ, ఎక్కువ మంది సీనియర్​ సిటిజన్లు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశ్యంతో మరోసారి గడువు పెంచుతున్నట్లు ఎస్​బీఐ పేర్కొంది.

Pension Rule: పెన్షన్ కావాలంటే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సిందే... లేదంటే పెన్షన్ కట్

కాగా, సీనియర్​ సిటిజన్లు స్పెషల్​ ఎఫ్​డీ స్కీమ్​ (FD scheme) ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. వారి ఫిక్సిడ్​ డిపాజిట్లపై సాధారణ పౌరుల కంటే 0.80 శాతం ఎక్కువ వడ్డీ (Interest) పొందవచ్చు. అయితే, నిర్ణీత వ్యవధిలో ఈ పథకంలో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం లభిస్తుంది.

Gold Sliver Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన బంగారం ధర

సీనియర్​ సిటిజన్ల ఎఫ్​డీపై 6.20 శాతం వడ్డీ..

సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఈ స్పెషల్​ ఎఫ్‌డి స్కీమ్ కింద ఐదేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు డిపాజిట్​ చేస్తే 30 బేసిస్​ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం, ఎస్బీఐ సాధారణ కస్టమర్లకు ఐదేళ్ల వ్యవధి గల ఎఫ్​డీపై కేవలం 5.4% వడ్డీ రేటు (Interest Rate)ను అందిస్తుంది. అదే, సీనియర్ సిటిజన్ స్పెషల్​ ఎఫ్​డీ స్కీమ్​ కింద డిపాజిట్ చేస్తే, 6.20% వడ్డీ రేటు పొందవచ్చు. ఈ వడ్డీరేట్లు 2021 జనవరి 8 నుండి వర్తిస్తాయి.

Discounts on Smart TVs: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్​​.. స్మార్ట్‌టీవీలపై తగ్గింపు

కాగా, కేవలం ఎస్​బీఐ (SBI) మాత్రమే కాకుండా, హెచ్​డీఎఫ్​సీ (HDFC) బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda), యాక్సిస్ (Axis) బ్యాంక్​లు కూడా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఎఫ్​డీ స్కీమ్​ను అమలు చేస్తున్నాయి. అయితే, హెచ్​డీఎఫ్​సీ, బీఓబీ (BOB) బ్యాంకుల్లో నేటితో స్కీమ్ గడువు ముగియనుంది. అయితే, సీనియర్ సిటిజన్స్ కోసం గోల్డెన్ ఇయర్ ఎఫ్​డీ స్కీమ్​ను అమలు చేస్తున్న ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్​ మాత్రం 2021 అక్టోబర్​ 7 వరకు ఈ స్కీమ్​ అమల్లో ఉంటుందని పేర్కొంది.
Published by:Shiva Kumar Addula
First published: